LPG cylinder | మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..?
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి.
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
చమురు సంస్థల నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,676గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,646కి తగ్గింది. అదేవిధంగా ముంబైలో రూ.1,629 నుంచి రూ.1,598కి తగ్గింది. ఇక చెన్నైలో రూ.1,840గా ఉన్న ధర ఇప్పుడు రూ.1,809కి పడిపోయింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1,787 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,756కి తగ్గింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, వరుసగా గత రెండు నెలల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్1న ఎల్పీజీ రేటు దాదాపు రూ.69 తగ్గగా, మే 1న సిలిండర్‌పై రూ.19 తగ్గింది. ఇక 14.2 కిలోల గృహ వినియోగ వంటగ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Also Read..
New Criminal Code | దేశంలో అమల్లోకి కొత్త న్యాయచట్టాలు.. తొలి కేసు ఎవరి మిదంటే?
NEET UG | నీట్ యూజీ రీఎగ్జామ్.. ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ
CM Chandrababu Naidu | ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. స్వయంగా అందజేసిన సీఎం బాబు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

