కరోనా థర్డ్‌వేవ్.. ఆచితూచి ముందుకెళ్లాలి.. సీఐఐ సూచన
కరోనా థర్డ్‌వేవ్.. ఆచితూచి ముందుకెళ్లాలి.. సీఐఐ సూచన | ఆంక్షల సడలింపుపై ఆచితూచి ముందుకు వెళ్లాలని, అన్నింటిని అనుమతించి ముప్పును కొని ....

ూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసులు తగ్గుతున్నాయని ఆంక్షల సడలింపు, వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేతపై ఆచితూచి ముందుకు వెళ్లాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సూచించింది. అన్ని కార్యకలాపాలను అనుమతించి మరో దఫా కరోనా వేవ్ ముప్పును తెచ్చుకోవద్దని సీఈఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు.
కరోనా మూడో దశ ఉద్ధృతి పొంచి ఉన్నందున అన్‌లాక్ విషయమై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ సూచించారు.

సప్లయ్ చైన్ పునరుద్ధరణపై దృష్టి సారించాలని హితవు పలికారు. దీంతో ఆర్థిక వృద్ధి ఊపందుకుని ప్రజలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.
‘అత్యవసరమైన రంగాలను తెరవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల పునరుద్ధరణకు మరికొన్ని రోజులు వేచి ఉండొచ్చు. అలా చేసి ముప్పు కొని తెచ్చుకోవడం ఎందుకు’ అని నరేంద్రన్ వ్యాఖ్యానించారు.

కరోనా రెండ్ వేవ్‌ను కట్టడి చేయడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల గత రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పిందని నరేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ వసూళ్లలో అది స్పష్టంగా కనిపించిందన్నారు.
ఇప్పటికైనా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రోజుకి కనీసం 71.2 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందన్నారు. అప్పుడే డిసెంబర్ నాటికి యువజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయగలమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

