Term Life Insurance | టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోండిలా..
జీవిత బీమా సంస్థలు.. భారతీయుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడంలో దిట్ట. అందుకే వారి రూట్లోనే వెళ్లి తమకు కావాల్సిన లాభాల్ని మరింత పెంచుకోవడం ఎలా? అన్న కోణం లో నిత్యం అన్వేషిస్తూంటాయి. అలా పుట్టినవే కొన్ని ప్లాన్లున్నాయి.
- ప్రీమియం రిటర్న్ వద్దు
Term Life Insurance | జీవిత బీమా సంస్థలు.. భారతీయుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడంలో దిట్ట. అందుకే వారి రూట్లోనే వెళ్లి తమకు కావాల్సిన లాభాల్ని మరింత పెంచుకోవడం ఎలా? అన్న కోణం లో నిత్యం అన్వేషిస్తూంటాయి. అలా పుట్టినవే కొన్ని ప్లాన్లున్నాయి.
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ల్లో ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ప్లాన్ వాటిలో ఒకటే. దేశంలో ఎక్కువమంది సంప్రదాయ ఎండోమెంట్ రకం జీవిత బీమానే ఇప్పటికీ తీసుకుంటున్నారు. అయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఓ ఉత్తమ ఎంపిక అని అర్థం చేసుకుంటున్నవారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు.
అయినా కొందరు భారతీయులు ఇంకా బీమా కొనుగోళ్ల సమయంలో మెచ్యూరిటీ (బీమా కాలవ్యవధి తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే వచ్చే ప్రయోజనం) అంశాన్నే ప్రధానంగా చూస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలతో నష్టమేనన్నది వారి భావన. అందుకే ఇలాంటివారి కోసం జీవిత బీమా సంస్థలు తెచ్చినవే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ప్లాన్లు.
ప్రస్తుతం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి ప్లెయిన్ లేదా సాధారణ ప్లాన్. మరొకటి ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ప్లాన్. బీమా కాలవ్యవధిలో పాలసీదారుడు చనిపోతే సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లోనైనా, ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ఉన్న టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లోనైనా ఒకేలా బీమా సొమ్ము మొత్తాలు వస్తాయి. కానీ సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మెచ్యూరిటీ అనేది ఉండదు. ప్రీమియం రిటర్న్ ఆప్షన్ పాలసీలో అది ఉంటుంది. అంటే బీమా కాలవ్యవధి తర్వాత పాలసీదారుడు బ్రతికి ఉంటే ఇన్సూరెన్స్ కోసం ఇన్నాళ్లూ మనం చెల్లించిన ప్రీమియం మొత్తాలన్నీ కూడా ఈ ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ప్లాన్‌లో తిరిగి వస్తాయి. ఇది పాలసీదారులను ఆకట్టుకునే ఆఫర్. అయితే ఇక్కడే అసలు మతలబు దాగున్నది.
ఇదీ సంగతి..
మెచ్యూరిటీ ఆఫర్‌కు ఆకర్షితులై ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ఉన్న టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొంటే చాలాచాలా నష్టం. సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలతో పోల్చితే ఈ ప్రీమియం రిటర్న్ ఆప్షన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలు ఎక్కువ మరి. అందుకే వీటి జోలికి వెళ్లొద్దని నిపుణుల సలహా.
ఉదాహరణగా చూస్తే..
కిరణ్ వయసు 25 ఏండ్లు. 30 ఏండ్ల కాలవ్యవధితో కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తాను సంప్రదించిన బీమా సంస్థలో సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియం రూ.18,934గా, ప్రీమియం రిటర్న్ ఆప్షన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వార్షిక ప్రీమియం రూ.47,712గా ఉన్నది. ఈ రెండు ప్రీమియంల మధ్య వ్యత్యాసం రూ.28,778. ఇది సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏడాదిన్నర ప్రీమియంకు సమానం.
పాల సీ కాలవ్యవధి 30 ఏండ్ల లో పాలసీదారుడు చనిపోతే వచ్చేది మాత్రం రెండు ప్లాన్లలో కోటి రూపాయలే అయినా.. సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 30 ఏండ్ల తర్వాత పాలసీదారుడు బ్రతికి ఉన్నా నయాపైసా రాదు. అదే ప్రీమియం రిటర్న్ ఆప్షన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఈ 30 ఏండ్లు మీరు చెల్లించిన వార్షిక ప్రీమియంలన్నీ తిరిగి వచ్చేస్తాయి. అంటే ఏటా రూ.47,712 చొప్పున 30 ఏండ్లకు రూ.14,31,360 వస్తుంది. దీంతో కిరణ్ దాన్నే ఎంచుకోవాలనుకున్నాడు.
ఇదీ నష్టం..
ప్రీమియం రిటర్న్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు ఎంత చెల్లిస్తే అంతే వస్తుంది. దానిపై ఎలాంటి వడ్డీ, ఇతర ప్రయోజనాలు రావు. అదే మీరు సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే.. ఏటా మిగిలే ఆ రూ.28,778ని 30 ఏండ్లపాటు ఎక్కడ పెట్టుబడి పెట్టినా 7 నుంచి 10 శాతం రిటర్న్స్‌తో 30 ఏండ్ల తర్వాత మీరు అందుకునే మొత్తం రూ.29 లక్షల నుంచి రూ.52 లక్షల మధ్య ఉంటుంది. ప్రీమియం రిటర్న్ ఆప్షన్ ప్లాన్‌లో 30 ఏండ్ల తర్వాత మీకు అందుతున్నది రూ.14.31 లక్షలే. దీన్నిబట్టి మీరు ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. కనీసం రూ.15 లక్షల నుంచి రూ.38 లక్షల వరకు నష్టపోతున్నారు.
చివరగా..
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నిజంగా పాలసీదారులకు ఎంతో లాభం. సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లకన్నా ఉత్తమం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అనవసరపు ఆఫర్లకు పొంగిపోయి బీమా సంస్థలు లేదా ఏజెంట్ల మాటల్ని నమ్మి ప్రీమియం రిటర్న్ ఆప్షన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకోకండి. సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకుని, మిగతా సొమ్మును పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ తదితర పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయండి. అప్పుడు మరింత ఆదాయాన్ని అందుకోవచ్చు. ఆర్థిక నిపుణుల్ని సంప్రదిస్తే మీకు సరిపోయే మరిన్ని పెట్టుబడి మార్గాలను సూచిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

