ఆటోను వీడని సెమీ కండక్టర్ కష్టాలు
ఫిబ్రవరిలో అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ, మార్చి 1: దేశీయ ఆటో రంగాన్ని చిప్‌ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం నుంచి 14 శాతం మేర దిగజారాయి. అంతర్జాతీయంగా ఉన్న సెమీకండక్టర్ కొరత.. దేశీయంగా ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నది. దీంతో అమ్మకాలూ తగ్గిపోతున్నాయి.