Cheque Bounce | చెక్ బౌన్సయితే ఫైన్.. ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్!
Cheque Bounce | మీరు జారీ చేసిన చెక్ బౌన్స్ అయితే జరిమానా చెల్లించాలి.. సెలవు దినాల్లోనూ నాచ్ సేవలు అందుబాటులోకి రావడమే కారణం.

Cheque Bounce | మీరు ఎవరికైనా ఆర్థిక లావాదేవీల కోసం చెక్ ఇచ్చారా? అయితే, మీ బ్యాంక్ ఖాతాలో సదరు చెక్‌పై రాసిన మొత్తానికంటే నగదు నిల్వలు తగ్గకుండా చూసుకోండి. ఎందుకంటే గతంలో మీరు జారీ చేసిన చెక్ గానీ, ఇతరులకు మీరిచ్చిన చెక్ గానీ బ్యాంకులో వేస్తే క్లియర్ కావడానికి ఎక్కువ టైం తీసుకోవడం లేదు.. ఎందుకంటే వారాంతపు సెలవులు, ఇతర సెలవు దినాల్లోనూ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) సేవలు అందుబాటులోకి వచ్చాయి.
భారీ మొత్తంలో నగదు చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించిన పేమెంట్స్ సిస్టం నాచ్. కరోనా టైంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద నగదు బదిలీకి నాచ్ వ్యవస్థను ఉపయోగించుకున్నది కేంద్రం.
ఇంతకుముందు వారాంతంలో అంటే ఆదివారాలు సెలవు. కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేదు. ఒకవేళ మీ ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. అదే జరిగితే మీరు జరిమానా చెల్లించాలి. అంతే కాదు నాచ్ సేవలను అందుబాటులోకి తేవడంతో ఇతర ఆర్థిక సేవలు పూర్తి చేసుకోవడానికి కస్టమర్లకు వెసులుబాటుగా ఉంటుంది.
నాచ్ సేవలు ప్రతిరోజూ అందుబాటులో ఉండటంతో సెలవు దినాల్లో వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఫోన్, రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు, బీమా ప్రీమియం చెల్లింపులు గడువు లోపే పూర్తి చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cheque bounce
- nach
- npci
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

