చాట్‌జీపీటీతో రిషి సునాక్, బిల్ గేట్స్ మాటామంతీ : ఏఐ చాట్‌బాట్ ప్రశ్నలకు బదులిచ్చిన ప్రముఖులు
గత రెండు నెలలుగా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. చాట్‌జీపీటీ తాజాగా బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసింది.
న్యూయార్క్ : గత రెండు నెలలుగా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. మ్యూజిక్ కంపోజ్ చేసేందుకు, పొయిట్రీ, వ్యాసాలు రాసేందుకు, హోంవర్క్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ చేసేందుకు ఇలా ప్రతి ఒక్కరూ వైరల్ ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తున్నారు. తాజాగా చాట్‌జీపీటీ బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఏఐ చాట్‌బాట్ తమ ముందుంచిన ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియోను బిల్ గేట్స్ లింక్డిన్లో షేర్ చేశారు. తనతో పాటు రిషీ సునాక్‌ను ఏఐ చాట్‌బాట్ ఇంటర్వ్యూ చేసిందని ఈ పోస్ట్‌లో గేట్స్ రాసుకొచ్చారు
తాను, గేట్స్ లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో బ్రిటన్ టాప్ ఇన్నోవేటర్స్తో సమావేశమయ్యామని బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ చెబుతుండటంతో వీడియో మొదలైంది. ఆపై చర్చలోకి బిల్ గేట్స్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమను ఏఐ ఇంటర్వ్యూ చేస్తోందని చెబుతారు. రాబోయే పదేండ్లలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ, జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం గురించి తొలి ప్రశ్న ఎదురవగా విద్యా, వైద్య రంగాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉండటంతో మనం మరింత సమర్ధంతగా వ్యవహరించాలని, ఏఐ ఈ దిశగా మరింత రాటుదేలుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యువ టెకీలకు ఇచ్చే సందేశం ఏంటని అడగ్గా బిల్ గేట్స్, రిషీ సునాక్‌లు బదులిస్తూ తాము అన్ని విషయాలను తేలికగా తీసుకుంటామని, ప్రస్తుతంలోనే బతుకుతూ ఆయా క్షణాలను ఆస్వాదిస్తామని చెప్పుకొచ్చారు. తాను వీకెండ్ కల్చర్‌కు దూరమని, పని కోసం ఎంత కష్టమైనా చేస్తానని గేట్స్ చెప్పుకొచ్చారు. ఇక తాను కూడా గేట్స్ వాదనతో ఏకీభవిస్తానని, వలసవాద కుటుంబం నుంచి వచ్చిన తాను తన పనితీరుతో ఎదిగేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని రిషీ సునాక్ పేర్కొన్నారు. ఇక ఏఐ తమ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలు వెల్లడిస్తూ తాను నోట్స్ రాసే సమయంలో పాటలు, పోయమ్స్ రాసే క్రమంలో ఏఐని ఉపయోగిస్తానని బిల్ గేట్స్ బదులిచ్చారు. ప్రతి వారం తన కోసం ప్రధాని క్వశ్చన్ టైమ్ నిర్వహణను ఏఐ చేపడితే బాగుంటుందని రిషి సునాక్ చమత్కరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

