న్యూఢిల్లీ, జూన్ 8: ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తిదారు సీసీఎల్ ప్రాడక్ట్స్..స్వీడన్‌కు చెందిన కాఫీ రోస్టర్స్ లోఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు కాఫీ బ్రాండ్లను చేజిక్కించుకుంది.
పెర్కాల్, రాకెట్ ఫ్యూయల్, ప్లాంటేషన్ వార్ఫ్, లండన్ బ్లెండ్, పెర్క్ అప్, పెర్కాల్ ఫ్యూజన్- ఈ ఆరు బ్రాండ్లను రూ.5.68 కోట్లకు కొనుగోలు చేసినట్టు సీసీఎల్ సీఈవో ప్రవీణ్ జైపురియార్ తెలిపారు. ఈ బ్రాండ్లతో బ్రిటన్‌లో మార్కెట్లలోకి ప్రవేశించగలుగుతామన్నారు.