Bit Coin | బిట్‌కాయిన్ గోల్డెన్ డేస్ గాన్.. పట్టు బిగిస్తున్న ఎథీరియం?
Bit Coin | క్రిప్టో మేజర్ బిట్ కాయిన్‌కు స్వర్ణ యుగం ముగిసింది. దాని తర్వాతీ స్థానంలోని ఎథీరియం దూసుకెళ్తున్నది.

Bit Coin | క్రిప్టో టోకెన్లు.. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మొదటి స్థానంలో ఉన్న బిట్ కాయిన్ కష్టకాలన్ని ఎదుర్కొంటున్నదా.. ఇప్పటి వరకు బిట్ కాయిన్ తర్వాతీ స్థానంలో ఉన్న ఎథీరియం.. మార్కెట్‌పై పట్టు బిగుస్తున్నదా.. అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. గతేడాది నవంబర్ 20న ఆల్‌టైమ్ రికార్డ్ 68,790 డాలర్లు పలికిన బిట్ కాయిన్.. మార్కెట్‌పై పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 శాతం నష్టపోయింది.. గోల్డెన్ డేస్‌గా భావిస్తున్నప్పటి విలువలో 45-40 శాతం పతనమైంది. ఆల్‌టైం గరిష్ట స్థాయి 68,790 డాలర్లను తాకిన బిట్ కాయిన్.. గురువారం 42,761 పాయింట్ల వద్ద ముగిసింది. కేవలం బిట్ కాయిన్ మాత్రమే కాదు.. అన్ని మేజర్ క్రిప్టో కరెన్సీలదీ అదే దుస్థితి.
అమెరికా ఫెడ్ రిజర్వు నిర్ణయంతో ఇలా
త్వరలో వడ్డీరేట్లను పెంచుతామని అమెరికా-ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో క్రిప్టోలపై సెంటిమెంట్ బలహీన పడినట్లు తెలుస్తున్నది. గత వారం బిట్ కాయిన్ గత వారంలో 8 శాతానికి పైగా పతనమైంది. ఎథీరియం, కార్డానో, రిఫిల్ తదితర క్రిప్టో టోకెన్లు కూడా భారీగా నష్టపోయాయి. బిట్ కాయిన్ 40 వేల డాలర్ల దిగువకు పడిపోతే 40 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య సంఘటితం అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి బిట్ కాయిన్ విలువ 20 శాతం పతనం అయ్యే చాన్స్ ఉందని ఇట్స్బ్లాక్చైన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు హితేశ్ మాల్వియా స్పస్టం చేశారు.
బిట్ కాయిన్‌పై పట్టుకు ఎథీరియంకు చాన్స్
మార్కెట్లో సర్దుబాట్లు మొదలైతే ఆందోళన తలెత్తడం ఖాయం.. ట్రేడర్లు అనిశ్చితినెదుర్కొంటున్న కాయిన్స్ వదుల్చుకుని బిట్ కాయిన్, ఎథీరియం వంటి టోకెన్లపై దృష్టి పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. బిట్ కాయిన్ బలహీన పడితే, దాని స్థానాన్ని ఎథీరియం ఆక్రమిస్తుందని ఇండియా బ్లాక్‌చైన్ అలయెన్స్ వ్యవస్థాపకుడు రాజ్ కేకపూర్ చెప్పారు. బిట్ కాయిన్ స్థానంలో రియల్ వరల్డ్ యుటిలిటీ కావడానికి కీలక అవకాశాలు ఉన్నాయన్నారు. ఎథీరియం అప్లికేషన్ల వాడంలో దాని బ్లాక్ చైన్ టెక్నాలజీ స్మార్ట్‌గా ఉండటంతో దాని పరిస్థితి మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.
కానీ, బిట్ కాయిన్ తర్వాత స్థానంలో ఎథీరియం ఉన్నా.. క్రిప్టో మేజర్ విలువలో 50 శాతానికి తక్కువే. 2022లో ఏ క్షణంలోనైనా బిట్ కాయిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి ఎథీరియం అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీగా నిలువొచ్చునని భావిస్తున్నారు. ఎథీరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగితే మాత్రం ఇన్వెస్టర్లను ఆకర్షించగలుతుందని రాజ్ కే కపూర్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

