న్యూఢిల్లీ : జావాను పునరుద్ధరించిన తర్వాత మహీంద్రాకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ బీఎస్ఏ మోటార్ సైకిల్స్‌ను సరికొత్తగా లాంఛ్ చేయనుంది. 1970ల్లో ఐకానిక్ బ్రిటిష్ మోటార్‌సైకిల్ తన కార్యకలాపాలను మూసివేయగా 2016లో క్లాసిక్ లెజెండ్స్ కొనుగోలు చేసి వచ్చే ఏడాది నుంచి క్లాసిక్ బైక్‌లను కస్టమర్ల ముందు సరికొత్తగా ఆవిష్కరించనుంది. గోల్డ్ స్టార్ మోటార్ సైకిల్‌తో బీఎస్ఏ రేపటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో కంబ్యాక్ కానుండగా దాని స్పెసిఫికేషన్లు బయటకివచ్చాయి.
గోల్డ్ స్టార్ 650 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగిఉంటుంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650కి దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. బర్మింగ్‌హాంలో బీఎస్ఏ బైక్ తయారవనుండగా భారత్‌లోనూ వీటి తయారీని చేపడతారని తెలిసింది. క్లాసిక్ మోటార్‌సైకిల్‌గా ముందుకురానున్న 2022 బీఎస్ఏ గోల్డ్ స్టార్ ఒరిజినల్ గోల్డ్ స్టార్ బైక్‌ను పోలి ఉంటుంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ షేప్‌తో ఫ్యూయల్ ట్యాంక్, లార్జ్ ఎయిర్‌బాక్స్, ఎగ్జాస్ట్ పైప్, రియర్‌వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లతో కస్టమర్లను కట్టిపడేస్తుంది.