Brent Crude | 10% తగ్గిన క్రూడ్.. కొత్త కొవిడ్ వేరియంట్ ప్లస్ అమెరికా నిర్ణయం ఎఫెక్ట్!
Brent Crude | బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.7 శాతం తగ్గి 8.77 డాలర్లు దిగి వచ్చి 73.45 డాలర్ల వద్ద స్థిర పడింది.

Brent Crude | అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర శుక్రవారం బ్యారెల్ పది శాతానికి పైగా పడిపోయింది. గతేడాది ఏప్రిల్ నుంచి గరిష్ఠంగా బ్రెంట్ ధర తగ్గడం ఇదే తొలిసారి. శుక్రవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.7 శాతం తగ్గి 8.77 డాలర్లు దిగి వచ్చి 73.45 డాలర్ల వద్ద స్థిర పడింది. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ కూడా 9.12 డాలర్లు (11.6 శాతం) తగ్గి బ్యారెల్ 69.27 డాలర్లకు చేరుకున్నది.
దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూసిందన్న వార్తలకు తోడు.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా, చైనా, భారత్ చమురు ధరలను నియంత్రించడానికి తమ వద్ద ఉన్న నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించినందున ముడి చమురు ధర తగ్గినట్లు తెలుస్తున్నది.
కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో ఫ్యూయల్ డిమాండ్, ఆర్థిక ప్రగతి తగ్గిపోతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా నుంచి బ్రిటన్, ఈయూ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే గురువారం మార్కెట్లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఎటువంటి సెటిల్మెంట్ చోటు చేసుకోలేదు. దీనికి గురువారం థ్యాంక్స్ గివింగ్ హాలీడే కారణం.
ఆసియా ఖండంలో తగ్గనున్న ధరలు
ఒనాడా బ్రోకరేజ్ సీనియర్ అనలిస్ట్ జెఫ్రీ హల్లేయ్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు పెరుగుతాయన్న ఆందోళన మధ్య ఆసియా ఖండంలో ముడి చమురు ధరలు దిగి వస్తాయన్నారు. ముడి చమురు ధరలను తగ్గించివేయడానికి భారీ చమురు వినియోగ దేశాలతో సమన్వయంతో వ్యవహరిస్తూ వ్యూహాత్మక రిజర్వుల నుంచి మిలియన్ల బ్యారెల్ క్రూడ్ విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా తదితర దేశాలను కోరింది. ఇందుకు డ్రాగన్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వచ్చే కొన్ని నెలలు అమెరికా, దాని మిత్ర దేశాలు భారీగా రిజర్వు నిల్వలను విపణిలోకి విడుదల చేస్తారని భావిస్తున్నారు.
ఒపెక్ మెట్టు దిగుతుందా?!
అమెరికా మిత్ర దేశాల నిర్ణయం నేపథ్యంలో ఒపెక్ కూడా మెట్టు దిగొస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో రోజుకు అదనంగా నాలుగు లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి చేస్తారని ఒపెక్ ఎకనమిక్ కమిషన్ బోర్డు అంచనా వేస్తున్నది. జనవరిలో 2.3 బిలియన్ టన్నులకు, ఫిబ్రవరిలో 3.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, అమెరికా, చైనా, భారత్, జపాన్.. రిజర్వు నిల్వలను విడుదల చేయాలన్న నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. తక్షణం ఉత్పత్తి పెంపుపై మాత్రం డిసెంబర్ రెండో తేదీన ఒపెక్ ప్లస్ కూటమి సమావేశం అవుతుందని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- brent crude
- opec+
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

