BMW SUV X5 | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) మార్కెట్లో అప్డేటెడ్ బీఎండబ్ల్యూ ఎస్యూవీ ఎక్స్5 (BMW X5) న్యూ వర్షన్ కారు శుక్రవారం ఆవిష్కరించింది. ఈ మోడల్ కారును చెన్నైలోని ప్రొడక్షన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసింది బీఎండబ్ల్యూ. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.
పెట్రోల్ ఆప్షన్ 3-లీటర్ల ఇంజిన్‌తో వచ్చిన మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎస్యూవీ ఎక్స్5 కారు 381 హెచ్‌పీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.4 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ రూ.95.9 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.1.07 కోట్లు పలుకుతుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు 48వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉన్నాయి. ఈ మోటార్ 12 హెచ్‌పీ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంది. న్యూ బీఎండబ్ల్యూ ఎక్స్5లోని అన్ని భాగాలు ఎస్యూవీ సెగ్మెంట్లో గ్లోబల్ మార్కెట్ లీడర్‌గా ఎదిగేలా చేస్తాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు. ఐదు సీట్లు, ఐదు డోర్ల కెపాసిటీతో మూడు కలర్స్ – బ్లాక్ షఫైర్, ఫైటోనిక్ బ్లూ, మినరల్ బ్లూ వైట్ కలర్స్ ఆప్షన్స్‌తో వస్తున్నది.