హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్లు, ఔషధాల తయారీ రంగ సంస్థ బయోలాజికల్ ఈ. లిమిటెడ్ (బీఈ) రూపొందించిన ‘కార్బేవ్యాక్స్’ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి ఎమర్జన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) ఆథరైజేషన్ లభించింది. ఈ మేరకు మంగళవారం బీఈ తెలియజేసింది.
ఇది స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన తొలి కొవిడ్-19 ఆర్బీడీ ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ కావడం విశేషం. 18 ఏండ్లు, ఆపై వయసున్నవారికి దేశీయ తొలి హెటిరోలోగస్ కరోనా బూస్టర్ కూడా ఇదే. ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి దీనికి అనుమతి లభించిన సంగతి విదితమే. కేంద్ర ప్రభుత్వానికి 100 మిలియన్లకుపైగా కార్బేవ్యాక్స్ డోసులను బీఈ సరఫరా చేసింది. కాగా, ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో నుంచి ఈయూఎల్ ఆథరైజేషన్ లభించడంపట్ల సంస్థ ఎండీ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు.