హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ, ఏపీల్లో 250కిపైగా స్టోర్స్‌తో రిటైల్ మొబైల్ విక్రయాల్లో దూసుకుపోతున్న బిగ్”సి’.. రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా తమ కస్టమర్లకు ‘దసరావళి డబుల్ ధమాకా ఆఫర్’లను అందిస్తున్నది.
ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువ కలిగిన ఇన్‌బేస్ ఇయర్ బడ్స్ రూ.199కే వస్తాయని లేదా రూ.3,999 విలువ కలిగిన గిజ్మోర్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ రూ.899కే లభిస్తుందని బుధవారం బిగ్”సి’ వ్యవస్థాపక సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.11,499 విలువైన ఫింగర్స్ బార్ స్పీకర్ ఊఫర్స్తోపాటు రూ.4,999కే పొందవచ్చని చెప్పారు. అలాగే ప్రతీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోళ్లపై రూ.3,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్లు కూడా ఉంటాయన్నారు.