Small Cap Funds | మూడేండ్లలో బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇవే.. రిటర్న్స్ 34.42 శాతం..!
Small Cap Funds | గత మూడేండ్లలో దేశంలోని స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఐదు పథకాల్లో పెట్టుబడులపై 34.42 శాతం రిటర్న్స్ లభించాయి.
Small Cap Funds | ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కుటుంబ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఎస్ఎస్వై, పోస్టాఫీసు డిపాజిట్ పథకాలతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టుబడులు పెడుతుంటారు. రిస్క్ ఉన్నా మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై లాభాలు కూడా మెరుగ్గానే ఉంటాయి. వాటిల్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. వాటిల్లో టాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులపై గత మూడేండ్లలో 34.42 శాతం లాభాలు గడించారు మదుపర్లు. గత నెల 27న సంబంధిత సంస్థలు సమర్పించిన వార్షిక రిటర్న్స్ ఆధారంగా బెస్ట్ ఫండ్స్ ఏమిటో తెలుసుకుందామా..!
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇలా
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులపై మూడేండ్లలో గరిష్టంగా 34.42 శాతం, ఐదేండ్లలో 28.7 శాతం లాభాలు వచ్చాయి. మూడు నెలల్లో 2.24 శాతం, ఆరు నెలల్లో 14.85 శాతం, ఏడాదిలో 58.5 శాతం లాభాలు గడించారు మదుపర్లు. ప్రస్తుతం ఫండ్ నికర విలువ రూ.4,60,44.13 కోట్లు.
ఇలా టాటా స్మాల్ క్యాప్ ఫండ్ రిటర్న్స్
రెగ్యులర్ ప్లాన్ కింద టాటా స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులపై మూడు నెలలకు 1.46 శాతం, ఆరు నెలలకు 10.86 శాతం, ఏడాది 40.65, మూడేండ్లలో 29.14, ఐదేండ్లలో 25.2 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఫండ్ నికర విలువ రూ.62,89.22 కోట్లు ఉంటుంది.
ఎడెల్ వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇలా
ఎడెల్ వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులపై ఐదేండ్లలో 26.75 శాతం రిటర్న్స్ లభిస్తే, మూడేండ్లలో 27.64 శాతం, ఏడాదిలో 51.52 శాతం, ఆరు నెలల్లో 12.83, మూడు నెలల్లో 0.81 శాతం రిటర్న్స్ అందుకున్నారు. ఫండ్ నికర విలువ 3,147.36 కోట్లు ఉంటది.
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇలా
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ నికర విలువ రూ.7,415.35 కోట్లు ఉంటుంది. ఈ ఫండ్ లో పెట్టుబడిపై మూడు నెలలకు 0.59 శాతం, ఆరు నెలలకు 10.56 శాతం, ఏడాదిలో 44.1, మూడేండ్లలో 27.2, ఐదేండ్లలో 24.89 శాతం రిటర్న్స్ అందుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

