బాండ్లలో పెట్టుబడి భేష్
రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, పొదుపు ఖాతాల్లో వచ్చే వడ్డీ అంతంతమాత్రంగానే ఉంటున్నది.
బాండ్లలో పెట్టుబడి భేష్
రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, పొదుపు ఖాతాల్లో వచ్చే వడ్డీ అంతంతమాత్రంగానే ఉంటున్నది. దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇటీవలి నెలల్లో 6-7 శాతం వరకూ అధికమైనా, సేవింగ్స్ ఖాతాలపై బ్యాంక్‌లు రేట్లను పెంచింది లేదు. వీటిపై వచ్చే వడ్డీ 3-4.5 శాతం మధ్యనే. ఈ నేపథ్యంలో పొదుపు ఖాతాల్లో మిగులు సొమ్మును అధిక రాబడి కోసం డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోకి మళ్లిస్తే అధిక రాబడిని అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు-మూడేండ్లు వేచిచూడగలిగేవారు సేవింగ్స్ ఖాతాకంటే 3 శాతం వరకూ అధికంగా లాభాన్నిచ్చే బాండ్లలో పెట్టుబడి చేయవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్‌కం ఫండ్ మేనేజర్ పంకజ్ పాఠక్ సూచనాప్రాయంగా తెలిపారు. మార్కె ట్ పరిస్థితులకు అనుగుణంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ వాటి పోర్ట్‌ఫోలియోలను మార్పు చేసుకునే వెసులుబాటు ఉంటుందని, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో మదుపరులకు ఇవి మెరుగైనవని వివరించారు. బ్యాంక్ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు వేగంగా పెరుగుతాయని భావించడం లేదని, డైనమిక్ బాండ్ ఫండ్స్/లిక్విడ్ ఫండ్స్ నుంచి ఇప్పటికే రాబడులు పెరిగాయని, భవిష్యత్తులో మరింత లాభం తెచ్చే అవకాశం ఉందన్నారు. రెండు, మూడేండ్ల పెట్టుబడి అవకాశాల కోసం తక్కువ రిస్క్‌గల సాధనాల్లో పెట్టుబడి చేయదల్చినవారు లిక్విడ్ ఫండ్స్‌కు కట్టుబడి ఉండవచ్చని పాఠక్ చెప్పారు.
ఏ లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి?
స్వల్పకాలిక పెట్టుబడి కోసం ప్రభుత్వ సెక్యూరిటీలు (బాండ్లు) పోర్ట్‌ఫోలియోల్లో కలిగిన లిక్విడ్ ఫండ్స్‌ను ఎంపికచేసుకోవచ్చని క్వాంటమ్ ఫండ్ మేనేజర్ సూచించారు. ప్రైవేటు రంగ కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్‌చేసిన లిక్విడ్ ఫండ్‌లో రిస్క్ ఎక్కువని, ఆ బాండ్లకు లిక్విడిటీ పరిమితంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజా సమీక్ష ప్రకారం 10 ఏండ్ల కాలపరిమితిగల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ (బాండ్లపై వచ్చే రాబడి) 7.20-7.60 శాతం మధ్య ట్రేడ్ కావొచ్చని అంచనా వేసింది. రిజర్వ్‌బ్యాంక్ పాలసీ రెపో రేటు పెంచితే షార్ట్ టెర్మ్ మనీ మార్కెట్ రేట్లు కూడా అధికమవుతూ ఉంటాయి. ప్రస్తుతం 3-5 ఏండ్ల కాలపరిమితిగల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 7.30-7.45 శాతం మధ్య కదులుతున్నది. ఇప్పుడున్న రెపో రేటు 5.9 శాతంకంటే ఈ బాండ్ ఈల్డ్స్ 140 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువగా ఉన్నాయి.
స్వల్పకాలిక బాండ్ ఈల్డ్స్ జోరు
రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షల్లో మరిన్ని రేట్ల పెంపులు ఉండవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. అయితే ఈ పెంపు ప్రస్తుత మోతాదుకంటే తక్కువస్థాయిలో ఉండవచ్చన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 10-20 ఏండ్ల దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్ కంటే మూడేండ్ల స్వల్పకాలిక బాండ్ ఈల్డ్ ఎక్కువగా పెరగవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

