కోల్కతా, జూన్ 24 : బంధన బ్యాంక్ డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రెండేండ్లు లేదా మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. ఇతర ఖాతాదారులకు 7.45 శాతం వడ్డీని చెల్లించనున్నది.
అలాగే ఐదేండ్లలోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75శాతం, ఇతర కస్టమర్లకు 7.25 శాతం వడ్డీని చెల్లించనున్నది. దీంతోపాటు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు పొదుపు ఖాతాలపై బ్యాంక్ 6.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.