Axis-Vistara Credit Card | యాక్సిస్‌తో విస్తారా జట్టు.. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుపై 4 సార్లు విమాన ప్రయాణం ఫ్రీ..!
Axis-Vistara Credit Card | దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారికి యాక్సిస్- విస్తారా క్రెడిట్ కార్డు నాలుగు కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్లు ఆఫర్ చేస్తున్నది.
Axis-Vistara Credit Card | ప్రతియేటా పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు గానీ, పండుగల వేళ.. వీకెండ్ సెలవులు వచ్చినా కొంత మంది హాలీడే ట్రిప్ వేస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకూ.. విదేశాల్లోని టూరిస్ట్ కేంద్రాలకు వెళ్లి జాలీగా గడిపి వస్తారు. మరి కొందరు బిజినెస్ అవసరాలు, ఇంకొందరు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు నిత్యం విమాన ప్రయాణం చేయాల్సి వస్తుంది. అటువంటి వారి ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలంటే క్రెడిట్ కార్డులతో పలు బెనిఫిట్లు ఉన్నాయి. విమానయాన సంస్థలతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి బ్యాంకులు.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. ఆయా క్రెడిట్ కార్డుల వాడకం ఆధారంగా ఉచితంగా విమాన టికెట్లు కూడా పొందొచ్చు. ఆ జాబితాలోకే వస్తుంది యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డు.. దీనిపై లభించే బెనిఫిట్లపై ఓ లుక్కేద్దామా..
వెల్కం గిఫ్ట్‌గా కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్
టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్‌తో కలిసి యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డుపై యూజర్లకు వెల్ కం గిఫ్ట్ రూపంలో ‘కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్ ఓచర్’ ఇస్తారు. ఈ ఓచర్.. కార్డు దారుల విస్తారా అకౌంట్‌తో జత చేస్తారు. ఈ ఓచర్ జారీ చేసిన మూడు నెలల వరకు పని చేస్తుంది. జాయినింగ్ ఫీజు పే చేయగానే ఓచర్ జారీ అవుతుంది.
రివార్డు పాయింట్లు ఇలా
ఈ కార్డు వినియోగంపై రూ.200 ఖర్చుకు రెండు క్లబ్ విస్తారా పాయింట్లు లభిస్తాయి. వీటిని విమాన టికెట్ కొనుగోలు టైంలో రీడీమ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా వాలెట్లు రీలోడ్ చేస్తే మాత్రం క్లబ్ విస్తారా పాయింట్లు లభించవు.
ఏటా మూడు విమాన ప్రయాణ టికెట్లు ఫ్రీ
నిర్దేశిత పరిమితి మేరకు ఖర్చు చేసిన వారికి 1000 బోనస్ క్లబ్ విస్తారా పాయింట్లు లభిస్తాయి. ప్రతి ఏడాది మూడు కాంప్లిమెంటరీ విమాన టికెట్లు అందుకోవచ్చు. కార్డు జారీ అయిన మూడు నెలల్లో రూ.50 వేలు ఖర్చు చేసిన వారికి 1000 క్లబ్ విస్తారా పాయింట్లు బోనస్‌గా లభిస్తాయి. ఖర్చు రూ.1.25 లక్షలు దాటితే ఒక ఎకానమీ క్లాస్ టికెట్ పొందొచ్చు. రూ.2.50 లక్షలు దాటిన వారికి మరో ఎకానమీ, రూ.6 లక్షలు దాటితే మూడో ఎకానమీ క్లాస్ టికెట్ లభిస్తుంది. అంటే ఒక ఏడాదిలో యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డుపై రూ.6 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మూడు ఫ్రీ విమాన టికెట్లు లభిస్తాయి. అయితే దేశీయంగా వివిధ నగరాల మధ్య ప్రయాణానికి మాత్రమే ఈ కార్డుతో బెనిఫిట్లు పొందొచ్చు. అలా లభించిన ఫ్రీ టికెట్.. ఆరు నెలల్లోపు వాడుకోవాలి.
విమానాశ్రయ లాంజ్ ల్లో కాంప్లిమెంటరీ పాస్‌లు
ప్రతి 90 రోజులకోసారి విమానాశ్రయాల్లో దేశీయ లాంజ్ల్లోకి ఉచిత ఎంట్రీకి రెండు కాంప్లిమెంటరీ పాస్ లు పొందొచ్చు. ఉచితంగా కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా బేస్ మెంబర్ షిప్ కూడా ఆఫర్ చేస్తారు. ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఈజీ డైనర్ ప్రోగ్రామ్ జాబితాలో ఉన్న రెస్టారెంట్లలో భోజనం చేసిన వారికి 25 శాతం, గరిష్టంగా రూ.800 వరకు రాయితీ పొందొచ్చు.
ఇన్సూరెన్స్ కవరేజీ ఇలా
ఈ కార్డుతో విమాన టికెట్, ఇతర కొనుగోళ్లపై రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ గ్యారంటీ లభిస్తుంది. ట్రావెల్ డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి 300 డాలర్ల ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లభిస్తుంది. బ్యాగేజీ పోయినా 300 డాలర్ల వరకు బీమా కవరేజీ అందుకోవచ్చు.
భారతీయ పౌరులై ఉండటంతోపాటు 18-70 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. వార్షిక ఆదాయం రూ.6 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉండాలి.
ఇవీ ఫీజుల వివరాలు
యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ.1500 చెల్లించాలి. ప్రతి యేటా రెన్యూవల్ ఫీజు కూడా రూ.1500 ఉంటుంది. జాయినింగ్, రెన్యూవల్ ఫీజులకు పన్నులు అదనంగా పే చేయాలి. ఈ కార్డు వినియోగంపై వడ్డీ ఏడాది ప్రాతిపదికన 52.86 శాతం విధిస్తారు. క్యాష్ అడ్వాన్స్ విత్ డ్రాయల్స్ మొత్తంపై 2.5 శాతం చార్జీ వసూలు చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

