ఐటీకి ఆటోమేషన్ గండం
30,00,000 కొలువులకు ముప్పు

ముంబై, జూన్ 16: ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ షాకివ్వబోతున్నది. పలు పరిశ్రమల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతంకావడంతో దేశీ ఐటీ కంపెనీలు 2022 సంవత్సరానికల్లా 30 లక్షల ఉద్యోగుల్ని తొలగించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా బుధవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. రొబొట్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ)ను అమలుచేయడం ద్వారా జీతభత్యాలకు, ఇతరాలకు వార్షికంగా చెల్లించే 10,000 కోట్ల డాలర్ల వరకూ కంపెనీలు ఆదా కానున్నదని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తు తం దేశీ ఐటీ రంగం 1.6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యత అవసరమైన సర్వీసులు, బీపీవోల్లో పనిచేస్తున్నట్లు నాస్కామ్ డాటా వెల్లడిస్తున్నది. ఇందులో 30 శాతం వరకూ (30 లక్షల మంది) 2022 కల్లా ఉద్యోగాలు కోల్పోతారని, 7 లక్షల ఉద్యోగాల్ని ఆర్పీఏ భర్తిచేస్తుందని, దేశీ ఐటీ కంపెనీలు చేపట్టనున్న టెక్నాలాజికల్ అప్గ్రేడ్స్, అప్స్కిల్లింగ్కారణంగా మిగతా ఉద్యోగాలకు కోత పడుతుందని, ఆర్పీఏ అప్స్కిల్లింగ్తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ తదితర కంపెనీలు వచ్చేఏడాదికల్లా గణనీయంగా ఉద్యోగాల్ని తగ్గిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. ఒక్క అమెరికాలోనే 10 లక్షల ఉద్యోగాలు పోతాయని, అయితే అధిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూనే వుంటుందని నివేదిక పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Automation
- IT employees
- job
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

