ఆటో డెబిట్ లావాదేవీల తిరస్కరణ.. కారణమేమిటంటే?
ఆటో డెబిట్ లావాదేవీల తిరస్కరణ.. కారణమేమిటంటే? రుణ వాయిదా (ఈఎంఐ)లు, వివిధ రకాల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆటో-డెబిట్ లావాదేవీలు వరుసగా ...

ముంబై: రుణ వాయిదా (ఈఎంఐ)లు, వివిధ రకాల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆటో-డెబిట్ లావాదేవీలు వరుసగా రెండో నెలలో తిరస్కరణకు గురయ్యాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) డేటా ప్రకారం గత నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్ లావాదేవీలకు గాను 30.8 మిలియన్ల లావాదేవీలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది మొత్తం లావాదేవీల్లో 35.91 శాతం.
అంతకుముందు ఏప్రిల్‌లో 85.4 మిలియన్ లావాదేవీలకు 29.08 మిలియన్లు తిరస్కరణకు లోనయ్యాయి. మహమ్మారితో క్రమంగా పెరిగిన ఆటో డెబిట్ లావాదేవీల తిరస్కరణ తగ్గి మార్చిలో సాధారణ స్థాయికి చేరింది.
కానీ కరోనా రెండో వేవ్ విజృంభణ, దాని కట్టడికి రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ల వల్ల ప్రతికూల తిరస్కరణ రేట్లు పెరిగాయి. కరోనా కట్టడికి విధించిన కఠిన ఆంక్షలు, లాక్డౌన్ వంటి అంశాలు ప్రజల ఆదాయాలకు గండికొట్టడం తిరస్కరణకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
తత్ఫలితంగా ప్రజలు తమ ఖాతాల్లో సరిపడా సొమ్ము ఉంచలేకపోతున్నారు. ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో సరైన సమయంలో ఈఎంఐలు, ఇతర ఆర్థికపరమైన వ్యయాల్ని చెల్లించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- auto debilt
- Lockdown
- reject
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

