Audi – Entry level EV Car | ఎంట్రీ లెవెల్ ఆల్ న్యూ ఈవీ తయారీపై ఆడీ ఫోకస్.. 2027లో ఆవిష్కరణ..?!
Audi - Entry level EV Car | చైనా ఈవీ కార్లకు పోటీగా అందుబాటు ధరలో ఉండేలా ఆల్ న్యూ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కసరత్తు చేస్తోంది.
Audi – Entry level EV Car | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ (Audi) సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్ చేస్తోంది. ఆల్ న్యూ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో స్మాల్ సెడాన్ లేదా కంపాక్ట్ ఎస్యూవీ మాదిరిగా ఆడీ ఆల్ న్యూ ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవల్ కారు ఉంటుందని తెలుస్తున్నది. 2027లో ఆల్ న్యూ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఆడీ క్యూ4 ఈ-ట్రాన్ దిగువన ఈ కారు ఉంటుందని, దీనిపేరు ఏ2 లేదా క్యూ2 అని పెట్టొచ్చునని ఆడీ సీఈఓ గెర్నాట్ డోల్నర్ తెలిపారు.
ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ ఎంఈబీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటుందని తెలుస్తున్నది. చైనా ఈవీ కార్ల తయారీ సంస్థలకు పోటీగా ఆడీ దూకుడుగా ముందుకు దూసుకెళ్లాలని తలపోస్తున్నది. చౌక ధరకే చైనా ఈవీ కార్లు అందుబాటులోకి రావడం కార్ల తయారీ సంస్థలకు ఆందోళన కలిగిస్తున్నది. ఆడి ఇటీవలే మార్కెట్లోకి క్యూ6ఈ-ట్రాన్ ప్రవేఫెట్టింది. అంతకుముందు ఈ-ట్రాన్ జీటీ, క్యూ4 ఈ-ట్రాన్, క్యూ8 ఈ-ట్రాన్ కార్లు ఆవిష్కరించింది. తాజాగా ఎంట్రీ లెవల్ ఈవీ కారు ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎంట్రీ లెవల్ ఈవీ ప్రధాన వాటా పొందుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

