Ather EV Rizta | 6న ఎథేర్ ఈవీ స్కూటర్ రిజ్టా ఆవిష్కరణ..!
Ather EV Rizta | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఎథేర్ ఎనర్జీ’.. ఏప్రిల్ ఆరో తేదీన నూతన స్కూటర్ ‘రిజ్టా (Rizta)’ను ఆవిష్కరించనున్నది.
Ather EV Rizta | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఎథేర్ ఎనర్జీ’.. ఏప్రిల్ ఆరో తేదీన నూతన స్కూటర్ ‘రిజ్టా (Rizta)’ను ఆవిష్కరించనున్నది. కొన్ని రోజులుగా పరీక్షిస్తున్న ఈ స్కూటర్ లార్జెస్ట్ బూట్ స్పేస్, లార్జెస్ సీట్ కలిగి ఉంటుంది. ఎథేర్ సీఈఓ తరుణ్ మెహతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో ఎథేర్ రిజ్టా షీట్ సైజ్ ఫోటో షేర్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, హోండా యాక్టీవా స్కూటర్లతో రిజ్టా స్కూటర్ సీటు పోలి ఉంటుంది. ఈ రిజ్టా ఈవీ స్కూటర్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.135 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. జూన్‌లో రిజ్టా ఈవీ స్కూటర్’ను ఎథేర్ ఎనర్జీ ఆవిష్కరిస్తుంది.
ఎథేర్ రిజ్టా ఈవీ స్కూటర్.. హరిజొంటల్ ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ స్క్రీన్, రైడ్ మోడ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఆప్షన్లు కలిగి ఉంటది. సింగిల్ చార్జింగ్‌తో 150 కి.మీ దూరం ప్రయాణం చేస్తుంది. రెండు వీల్స్ లోనూ సస్పెన్షన్ కోసం డిస్క్ బ్రేక్స్తోపాటు ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనోషాక్ అబ్జార్బర్ యూనిట్ ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ స్కూటర్ రూపొందించామని ఎథేర్ చెబుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

