పియానో వాయించడానికి మళ్లీ ప్రయత్నిస్తా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా పోస్ట్ వైరల్..!
Ratan Tata: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఇప్పటివరకు ఎవరికీ తెలియని తన ఇష్టాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పియానో వాయించడం అంటే తనకు చిన్నప్పటి నుంచి

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఇప్పటివరకు ఎవరికీ తెలియని తన ఇష్టాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పియానో వాయించడం అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని వెల్లడించారు. ప్రస్తుతం 83 ఏండ్ల వయసులో ఉన్న రతన్ టాటా పియానోతో తన ప్రయాణాన్ని గురించి ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్చేశారు. తాను చిన్నతనంలోనే పియానో వాయించడం కొద్దిగా నేర్చుకున్నానని, రిటైర్ అయిన తర్వాత మళ్లీ పియానో వాయించడం హాబీగా పెట్టకున్నానని రతన్ టాటా తెలిపారు. కానీ, ఇప్పుడు పియానోపై అవసరమైనంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానని చెప్పారు. సమీప భవిష్యత్తులో మరోసారి తాను పియానో వాయించే ప్రయత్నం చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
“నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు పియానోని కొద్దిగా నేర్చుకున్నాను” అంటూ ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్టును మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇంకా బాగా పియనో నేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నానని పేర్కొన్నారు. తన పదవి విరమణ తర్వాత ఒక గొప్ప పియానో టీచర్ దొరికారని, కానీ తాను రెండు చేతులతో పియనో ప్లే చేయడానికి అవసరమైన ఏకాగ్రత పెట్టలేకపోయానని తెలిపారు. కానీ సమీప భవిష్యత్తులో మరోసారి ప్రయత్నిస్తానని ఆశాభావం వ్యక్తపర్చారు. ఈ పోస్టులో రతన్ టాటా అత్యంత ఏకాగ్రతతో పియానోపై తన చేతులు ఆడించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది.
కాగా, రతన్ టాటా చేసిన ఈ పోస్ట్‌ను కేవలం 24 గంటల వ్యవధిలోనే తొమ్మది లక్షల మంది యూజర్స్ లైక్ చేశారు. అదేవిధంగా తొమ్మిది వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. రతన్ టాటా తనలోని ప్రతిభను పెంపొందించుకునే ప్రయత్నం చేయడం చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ యూజర్.. మీరు మార్గదర్శి సార్ అని కామెంట్ చేశాడు. మరో యూజర్ మీరు లెజెండ్ సార్ అని పేర్కొన్నాడు. కామెంట్ సెక్షన్లో ఎర్రటి హృదయం బొమ్మలు, ఎమోజీలతో నిండిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Piano
- ratan tata
- Tata Group
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

