ఆసియా నం 1 అదానీ.. సంపన్నుల జాబితాలో 92.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానం
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి దేశీయంగానేగాక, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.
- 90.8 బిలియన్ డాలర్లతో అంబానీకి రెండో ర్యాంక్
- తాజా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో వెల్లడి
- 656 బిలియన్ డాలర్లతో ఎలాన్ మాస్క్ వరల్డ్ టాప్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి దేశీయంగానేగాక, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం అదానీ సంపద విలువ 92.6 బిలియన్ డాలర్లుగా ఉన్నది. భారత్‌తోపాటు ఆసియా దేశాల్లోనే ఇది టాప్. ఇక ముకేశ్ అంబానీ సంపద విలువ 90.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ జోష్
దేశీయ స్టాక్ మార్కెట్లలో గౌతమ్ అదానీకి చెందిన 10 సంస్థలు ట్రేడ్ అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా ఉన్న అదానీ గ్రూప్‌నకు భారీ ప్రైవేట్ సీపోర్ట్ నెట్వర్క్ సైతం ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇన్ఫ్రా, రవాణా, మైనింగ్, డాటా సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్, రియల్టీ, సిమెంట్, మీడియా ఇలా అనేక రంగాల్లోనూ అదానీ కంపెనీలు విస్తరించాయి. అయితే ఇటీవలికాలంలో దాదాపు అన్ని కంపెనీల షేర్లకు మదుపర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్నది. ఫలితంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగిపోయింది.
ఇదే ముకేశ్ అంబానీని అధిగమించి మళ్లీ గౌతమ్ అదానీని అగ్రస్థానంలో నిలబెట్టింది. మరోవైపు ఈ స్థాయిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పుంజుకోలేకపోయింది. ఇక బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచ స్థాయిలో అదానీ 19, అంబానీ 20వ స్థానాల్లో ఉన్నారు. కాగా, రోజూ ప్రపంచంలోని టాప్-500 శ్రీమంతుల సంపద బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్డేట్ అవుతూ ఉంటుందన్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే శుక్రవారం అప్డేట్లో అంబానీని అదానీ దాటేసినట్టు తేలింది. 2022 ఫిబ్రవరిలో తొలిసారి అంబానీని వెనుకకు నెట్టి గౌతమ్ అదానీ సంపన్నుల జాబితాలో నంబర్ వన్ అయ్యారు. ఆ తర్వాత హిండెన్‌బర్గ్ దెబ్బకు మార్కెట్ వాల్యూ కరిగిపోయి పడిపోయారు.
వరల్డ్ టాప్-3 వీళ్లే..
ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఉన్నారు. లర్రీ పేజ్ (286 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు) ఆ తర్వాత ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

