SBI A/C | మీ అకౌంట్లో డబ్బుల్లేవా.. అయితే జాగ్రత్త పడండి!
SBI A/C | ఎస్బీఐలో తెరిచిన ఖాతా సరిగ్గా లావాదేవీలు జరుపకుంటే దాన్నిమూసేయడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

SBI A/C | ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో ఖాతాలు సాధారణం.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగుల వేతనాలన్నీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుంటాయి. అయితే, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు వివిధ కారణాల రీత్యా.. తాము పని చేస్తున్న సంస్థ మారినప్పుడల్లా.. యాజమాన్యాల నిర్ణయాలకు అనుగుణంగా మరో బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవాల్సి వస్తుంది. ఇది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారవుతారు. ప్రత్యేకించి ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది ఖాతాలు ప్రారంభిస్తుంటారు.

ఎక్కువ ఖాతాలతో ఫీజుల భారం..
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతోపాటు వ్యక్తిగతంగా.. వ్యాపార పరంగానూ వేతన, సేవింగ్స్.. కరంట్.. డీమ్యాట్ ఖాతాలు తెరుస్తారు. వీటి నిర్వహణకు, లావాదేవీలకు బ్యాంకులు ఫీజు వసూలు చేస్తుంటాయి. కనుక మీరు ఎస్బీఐలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నా.. ఒకే ఖాతా ఉన్నా నిరంతరం లావాదేవీలు నిర్వహించకపోతే దాన్ని క్లోజ్ చేయడం మెరుగైన పని. అలా చేయడం వల్ల ఖాతా లావాదేవీలు.. నిర్వహణ ఫీజుల చెల్లింపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

లావాదేవీలు జరపని ఖాతా ‘డార్మెంట్‘
నిర్దిష్ట కాలం ప్రకారం.. కొన్నేండ్లకు పైగా లావాదేవీలు నిర్వహించని ఖాతాలు ఉంటాయి. వాటిని ఎస్బీఐ యాజమాన్యం డార్మెంట్ లేదా ఇన్యాక్టివ్ ఖాతాగా ముద్ర వేస్తుంది. దీనికీ ఓ కారణం ఉంది. ఈ ఖాతా ద్వారా ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిలువరించడం కోసం ఎస్బీఐ దానిపై ఇన్యాక్టివ్ లేదా డార్మెట్ అనే ముద్ర వేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాల నిర్వహణ ముప్పేమీ కాదు గానీ.. నిర్లక్ష్యం కిందకు వస్తుంది.. తదుపరి నష్టాలకు దారి తీస్తుంది.

మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఇవీ సమస్యలు..
నగరాలు లేదా.. పట్టణాలు.. గ్రామాల వారీగా ఆయా శాఖ ప్రాంతాన్ని బట్టి సేవింగ్స్/ శాలరీ/ కరంట్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మనీ జమ చేసి ఉండాలి. ఆ ఖాతాల నిర్వహణతోపాటు డెబిట్ కార్డు చార్జీలు, ఎస్సెస్మెస్ తదితర చార్జీలన్నీ తప్పనిసరిగా చెల్లిస్తూ ఉండాలి. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ కొనసాగించకపోతే మాత్రం.. మీ ఖాతా నుంచి నెలవారీ క్వార్టర్లీ బ్యాలెన్స్ (ఎంక్యూబీ) నగదు డిడక్షన్ అవుతుంది. కనుక ఎస్బీఐలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నా.. లావాదేవీలు జరుపని ఖాతాలు ఉన్నా వాటిని తప్పనిసరిగా మూసేయడం ఉత్తమం అని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా మూసేయడానికి ముందు.. దాని డాక్యుమెంట్లు.. వ్యక్తిగత పత్రాలు రెడీగా ఉంచుకోవాలి..

సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్
డెబిట్ కార్డు..
చెక్ బుక్..
పాస్బుక్.
ఐడీ అండ్ అడ్రస్ ప్రూఫ్
క్లోజర్ లెటర్ లేదా క్లోజర్ ఫామ్

గుర్తుంచుకోవాల్సిన అంశాలివి..
- బ్యాంకు ఖాతా మూసేయడానికి ముందు పెండింగ్లో పెట్టిన అన్ని బకాయిలు చెల్లించాలి.
- గతంలో ఆ ఖాతా ద్వారా తీసుకున్న రుణానికి సంబంధించిన నెలవారీ రుణ వాయిదాలు (ఈఎంఐ),
- క్రెడిట్ కార్డును మీరు నిత్యం లావాదేవీలు జరిపే ఖాతాకు బదిలీ చేసుకోవాలి.
- జీరో బ్యాలెన్స్ ఉన్నఖాతాలను మీకు సమీపంలోని బ్యాంకు శాఖకు బదిలీ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు.. సమస్యలు ఉండవు.
- ఈ ఖాతా మళ్లీ పునఃప్రారంభించడం సాధ్యం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఎస్బీఐ ఖాతా మూసేయడం ఎలా
- మీరు ఆన్లైన్లో ఎస్బీఐ సేవింగ్స్, శాలరీ, కరంట్ ఖాతా క్లోజ్ చేయడం సాధ్యం కాదు. మీరు తప్పనిసరిగా మీ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లి.. ఖాతా మూసేస్తున్నట్లు తెలిపే దరఖాస్తు లేఖ లేదా ఫామ్, ఖాతా క్లోజ్ చేయడానికి అవసరమైన పత్రాలను సమర్పించాలి.
- మీ లేఖలో ఖాతా మూసేయానికి గల కారణాలను వివరించాలి. బ్యాంక్ పాస్బుక్, డెబిట్ కార్డు, చెక్బుక్ వెనక్కు ఇచ్చేయాలి.
- మీ ఖాతా కాలాన్ని బట్టి బ్యాంకు శాఖ అధికారులు ఖాతా క్లోజ్ చార్జీలు విధించే అవకాశాలు ఉన్నాయి.
- బ్యాంకు శాఖలో అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఎస్బీఐ వెబ్సైట్ నుంచి అకౌంట్ క్లోజర్ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- మీ ఖాతా క్లోజ్ చేయడానికి ముందు దానిపై ఏడాది పాటు బ్యాంకు అధికారులు ఎటువంటి చార్జీలు విధించకూడదు.
- ఖాతా ప్రారంభించిన 15 రోజుల నుంచి ఏడాది లోపు దాన్ని క్లోజ్ చేస్తే.. సంబంధిత ఖాతాదారు రూ.500 పై చిలుకుఫీజుతోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
- వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం కరంట్ ఖాతా తెరిచిన 14 రోజుల నుంచి ఏడాది లోపు దాన్ని మూసేస్తే రూ.1000 చార్జీతోటు జీఎస్టీ చెల్లించాలి. ఏడాది నుంచి ఐదేండ్లలోపు క్లోజ్ చేస్తే రూ.500తోపాటు జీఎస్టీ చెల్లింపు అదనం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- sbi account
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

