న్యూయార్క్ : గత ఏడాది నవంబర్‌లో వివిధ విభాగాల్లో పనిచేసే 18,000 మందిని తొలగించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon layoffs) కొలువుల కోతకు బ్రేక్ పడలేదు. ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్ మరో 9000 మందిని విధుల నుంచి తొలగించగా మొత్తం కొలువులు కోల్పోయిన ఉద్యోగుల సంఖ్య 27,000కు చేరింది.
ఇక తాజాగా మరో విడత లేఆఫ్స్‌ను కంపెనీ ప్రకటించడం కలకలం రేపింది. లేటెస్ట్ లేఆఫ్స్లోఅమెజాన్ మ్యూజిక్‌లో పనిచేసే ఉద్యోగులపై పెను ప్రభావం పడింది. ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో పలువురు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. అమెజాన్ మ్యూజిక్ ఎడిటోరియల్, ఆడియో కంటెంట్ టీం సభ్యులకు పింక్ స్లిప్ ఇచ్చినట్టు పేర్కొంది.
సంస్ధ అవసరాలకు అనుగుణంగా కంపెనీ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నరని ఈ రిపోర్ట్ తెలిపింది. ఈ దిశగా అమెజాన్ మ్యూజిక్ టీంలో కొన్ని ఉద్యోగాలను తొలగించినట్టు వెల్లడించింది. అమెజాన్ మ్యూజిక్‌లో పెట్టుబడులు కొనసాగుతాయని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు.
Read More :
The Diary of a CEO | ఈ 14 సూత్రాలు పాటిస్తే మీ లైఫ్‌కి మీరే బాస్ అవ్వొచ్చు!