న్యూఢిల్లీ : న్యూ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రకటించింది. మే 4 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా ఐఫోన్ 14, వన్‌ప్లస్ 10ఆర్, ఐక్యూఓఓ జడ్6 లైట్ వంటి స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ ఉంటాయని వెల్లడించింది. ఇటీవల లాంఛ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఈ నెలాఖరు వరకూ ఈ సేల్‌ను అమెజాన్ రన్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై ఈ-కామర్స్ దిగ్గజం స్పష్టత ఇవ్వనుంది. సేల్ పీరియడ్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ సేల్ పేజ్ వెల్లడించింది. అయితే ఐఫోన్ 14ను ఏ ధరకు ఆఫర్ చేస్తున్నారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఇక భారత్‌లో ఇటీవల లాంఛ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకుని రూ. 12,490కి లభించనుంది. రూ. 15,000లోపు బెస్ట్ 5జీ ఫోన్లలో ఇది ఒకటి కాగా, అమెజాన్ సేల్‌లో ఇది ఆకర్షణీయ డీల్‌గా కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ 5జీ ఫోన్‌ను శాంసంగ్ భారత్‌లో రూ. 14,990 ప్రారంభ ధరకు ప్రవేశపెట్టారు.
Read More