Amazon vs Flipkart | నేను ముందంటే.. నేను ముందు.. ఈ-కామర్స్ సంస్థల పోటీ
ఇండియాలో టాప్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ( Amazon vs Flipkart ) పండగలకు ముందు సేల్స్ విషయంలో పోటీ పడుతున్నాయి.

ఇండియాలో టాప్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ( Amazon vs Flipkart ) పండగలకు ముందు సేల్స్ విషయంలో పోటీ పడుతున్నాయి. ఏ పెద్ద పండగ వచ్చినా.. సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్లు ప్రకటించే ఈ సంస్థలు.. ఇప్పుడు కూడా దసరా ముందు అదే పని చేశాయి. అయితే నేను ముందు అంటే నేను ముందు అన్నట్లుగా ఒకరిని చూసి మరొకరు తమ సేల్ తేదీలను మార్చడం విశేషం. మొదట ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 7 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఆ తర్వాత అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 4నే ప్రారంభమవుతుందని చెప్పింది.
దీంతో ఫ్లిప్‌కార్ట్ తన తేదీలను మారుస్తూ అమెజాన్ కంటే ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 3నే బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఇది చూసి అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఒక రోజు ముందుకు జరిపి.. అక్టోబర్ 3నే ప్రారంభం కానున్నట్లు తాజాగా వెల్లడించింది. ఒకరిని చూసి మరొకరు సేల్ తేదీలను మార్చడం చూస్తుంటే.. ఈ రెండు ఈ-కామర్స్ సైట్ల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

