Elon Musk | యూట్యూబ్ తరహాలో ట్విట్టర్లో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే?!
Elon Musk | యూట్యూబ్, వాట్సాప్ తరహాలో ట్విట్టర్ లోనూ రెండు కొత్త ఫీచర్లు తెస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు.
Elon Musk | ట్విట్టర్లో వచ్చేవారం రెండు కొత్త ఫీచర్లు పరిచయం చేస్తామని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎలన్ మస్క్ ఈ సంగతి చెప్పారు.
ట్విట్టర్ను ఎలన్ మస్క్ టేకోవర్ చేశాక పలు మార్పులు తెస్తున్నారు. ఇతర యాప్ లకు భిన్నంగా ఉండటానికి కొత్త ఫీచర్లు తెస్తున్నారు.
ట్విట్టర్ లో పోస్ట్ చేసే వీడియోలకు 15 సెకన్ల ఫార్వర్డ్, బ్యాక్ బటన్లు జత చేయాలని కోరుతూ ట్వీట్ చేసిన జెస్సీ డాగెర్టీ అనే నెటిజన్.. దాన్ని ఎలన్ మస్క్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. దీనిపై రియాక్టయ్యారు ఎలన్ మస్క్. ‘వచ్చేవారం పిక్-ఇన్-పిక్ మోడ్ తోపాటు వీడియో ఫార్వార్డ్, బ్యాక్ బటన్లు వస్తాయంటూ ట్వీట్ చేశారు. పిక్-ఇన్-పిక్ మోడ్ సాయంతో యూట్యూబ్ తరహాలో నెటిజన్లు చిన్న విండోలో వీడియో వీక్షిస్తూ వెబ్ పేజీలో తమ పని చేసుకోవచ్చు. ఫార్వర్డ్ లేదా బ్యాక్ బటన్ సాయంతో వీడియోను ముందూ వెనుకలకు జరుపవచ్చు. వాట్సాప్, యూ ట్యూబ్ వంటి యాప్స్లో ఈ ఫీచర్లు ఉన్నాయి.
ఎలన్ మస్క్ ట్వీట్ చూశాక నెటిజన్లు రియాక్టయ్యారు. ఇటువంటి ఫీచర్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని, వీటిని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు అని కామెంట్లు చేస్తున్నారు. గతేడాది ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి సంస్థ సీఈఓగా వ్యవహరించిన ఎలన్ మస్క్.. ఇటీవలే లిండా యాకరినోను సీఈఓగా నియమించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

