దేశ, విదేశాల్లో ఆరోగ్య అవసరాలను తీర్చే యాక్టివ్ హెల్త్ ప్లాటినమ్ ప్రీమియర్ ప్లాన్ పాలసీని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. దీనితో నష్టపరిహారంతోపాటు, ఫిక్స్డ్ బెనిఫిట్ కవరేజీని అందిస్తారు. ఫిట్గానూ, ఆరోగ్యంగానూ ఉంటే హెల్త్ రిటర్న్స్ కింద 100 శాతం ప్రీమియంను పొందవచ్చు. అలాగే క్లెయిం చేయని సంవత్సరంలో 50 శాతం బోనస్ లభిస్తుంది. 16 మేజర్ అనారోగ్యాలకు విదేశాల్లో కవరేజీ రూ.3-6 కోట్ల వరకు ఉంటుంది. దేశ, విదేశీ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అందుతుంది. ఎక్స్పర్ట్ హెల్త్ చెకప్, దీర్ఘకాల జబ్బుల మేనేజ్మెంట్, హోమ్ ట్రీట్మెంట్, సెకండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, పర్సనల్ యాక్సిడెంట్, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలు కూడా ఈ పాలసీలో భాగంగా ఉంటాయి. ఈ పాలసీ కింద డయాబెటిస్, బీపీ, ఆస్తమా లాంటివి కూడా కవర్ అవుతుండటం విశేషం.