Goutam Adani | భారత ఆర్థిక వ్యవస్థపై అదానీ గ్రూప్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Goutam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే.. రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 18 నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ మేర వృద్ధిచెందే అవకాశం ఉందని అంచనా వేశారు. 2050 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Goutam Adani : అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే.. రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 18 నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ మేర వృద్ధిచెందే అవకాశం ఉందని అంచనా వేశారు. 2050 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భారతీయులకు ఇంతకంటే మెరుగైన సమయం ఎప్పుడూ రాలేదని అన్నారు. ఇలాంటి వృద్ధి అవకాశాలు ఇతర ఏ దేశాలకూ లేవని అన్నారు. రేటింగ్ ఏజెన్సీ ‘క్రిసిల్’ బుధవారం నిర్వహించిన ‘యాన్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’లో గౌతమ్ అదానీ పాల్గొని మాట్లాడారు. భారత జీడీపీ తొలి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అందుకోవడానికి 58 సంవత్సరాలు పట్టిందని, తదుపరి ట్రిలియన్కి చేరుకోవడానికి 12 ఏళ్లు, మూడవ ట్రిలియన్ అందుకోవడానికి కేవలం 5 సంవత్సరాల సమయం మాత్రమే పట్టిందని గౌతమ్ అదానీ ప్రస్తావించారు.
భారత స్టాక్ మార్కెట్లు భారీగా వృద్ధి చెందడం ఖాయమని గౌతమ్ అదానీ అంచనా వేశారు. 2050 నాటికి ఆర్థిక వ్యవస్థ పరిణామం 30 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఈ సమయానికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాబోయే 26 ఏళ్లలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 36 ట్రిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనాకట్టారు. ఇక భారత్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా మారిపోతున్నాయని, ఈ మార్పుల ప్రభావం ఒక దశాబ్దం తర్వాత కనిపిస్తుందని, అప్పుడు అందరూ ప్రశంసిస్తారని అదానీ పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

