Adani into Health Care | మెట్రో పొలిస్ టేకోవర్కోసం అదానీ-అపొలో టైఅప్?!
Adani into Health Care | అతిపెద్ద హాస్పిటల్ నెట్వర్క్ అపోలోతో కలిసి మెట్రో పొలిస్ టేకోవర్‌కు అదానీ గ్రూప్ బిడ్ దాఖలుకు చర్చిస్తున్నది.
Adani into Health Care | బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ హెల్త్ వెంచర్స్ (ఏహెచ్‌వీఎల్), దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ ఆపరేటర్స్ సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో జత కట్టింది. మెట్రో పొలిస్ హెల్త్‌కేర్‌లో మెజారిటీ వాటా కైవసం చేసుకునేందుకు అపోలో హాస్పిటల్స్‌తో అదానీ హెల్త్ వెంచర్స్ బిడ్స్ దాఖలు చేయడానికి చర్చలు జరుపుతున్నది. మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనీసం రూ.7,765 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) ఉంటుందని ఆ రెండు సంస్థల సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హెల్త్‌కేర్ రంగంలోకి ఎంటరవుతున్నట్లు అదానీ గ్రూప్ గత నెలలో ప్రకటించింది. హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ నెట్‌వర్క్‌లను టేకోవర్ చేసుకోనుందని వార్తలొచ్చాయి. ఇందుకోసం గత నెలలో అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ అదానీ హెల్త్ వెంచర్స్ (ఏహెచ్‌వీఎల్) ఏర్పాటు చేసింది.
1980వ దశంలో మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ సంస్థ ఒక ల్యాబ్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో మెట్రో పొలిస్ హెల్త్‌కేర్ డయాగ్నస్టిక్ చైన్ సేవలందిస్తున్నది. 2005లో ఐసీఐసీఐ వెంచర్ రూ.35 కోట్లు తొలుత మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ డయాగ్నిస్టిక్ చైన్‌లో పెట్టుబడి పెట్టింది. అటుపై పీఈ ఫర్మ్ వార్బర్గ్ పింకస్ 85 మిలియన్ల డాలర్లతో ఐసీఐసీఐ వెంచర్ వాటాను కొనుగోలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

