Biggest bank fraud: 28 బ్యాంకులను… రూ.22,842 కోట్ల మేర మోసగించిన ఏబీజీ షిప్‌యార్డ్
న్యూఢిల్లీ: మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది. దీంతో ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌పై కేసు నమోదు చేసింది.
ఏబీజీ గ్రూప్ కంపెనీల్లో, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ కీలకమైంది. గుజరాత్‌లోని దహేజ్, సూరత్‌లో దీనికి షిప్యార్డ్లున్నాయి. షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్‌లో పేరున్న ఈ కంపెనీ సుమారు 165 నౌకలను నిర్మించింది. దీంతో కంపెనీ అవసరాల నిమిత్తం ఎస్బీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల నుంచి కోట్లలో భారీగా రుణాలు పొందింది. అయితే ఆ నిధులను కంపెనీ అవసరాలకు వినియోగించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. కంపెనీ, దాని డైరెక్టర్లు తమ సొంత లాభం కోసం బ్యాంకు నిధులను దారి మళ్లించారని, బ్యాంకులకు వాయిదాలు చెల్లించకుండా చేతులెత్తేశారని సీబీఐ తెలిపింది.
కాగా, 2019 నవంబర్ 8న ఎస్బీఐ తొలిసారి సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపించింది. ఎస్బీఐకు రూ.2,925 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.7,089 కోట్లు, ఐడీబీఐకి రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.1,244 కోట్లు, ఐవోబీకి రూ.1,228 కోట్లు బకాయి పడినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో అతి పెద్ద బ్యాంకు మోసంపై సీబీఐ దృష్టిసారించింది. 2020 మార్చిలో దీనిపై మరింత సమాచారం, ఆధారాలు సేకరించింది.
మరోవైపు, గత ఏడాది ఆగస్ట్‌లో ఎస్బీఐ తాజాగా ఏబీజీ షిప్‌యార్డ్‌పై మరోసారి ఫిర్యాదు చేసింది. 28 బ్యాంకులు మంజూరు చేసిన నిధులను 2012 ఏప్రిల్ -2017 జూలై మధ్య ఇతర అవసరాలకు మళ్లించి మోసగించినట్లు ఆరోపించింది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను కూడా బయటపెట్టింది.
దీంతో ఈ భారీ బ్యాంకు మోసంపై ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ చివరకు ఈ నెల 7న ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర వారు మోసగించినట్లు ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

