You-Tube | కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూ-ట్యూబ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ‘పాజ్’ అనే పేరుతో తెచ్చిన ఈ ఫీచర్ సాయంతో పాత కామెంట్లు అలాగే కొనసాగిస్తూ, కొత్త కామెంట్లు నిలువరించవచ్చు. కంటెంట్ క్రియేటర్లకు తమ కామెంట్ సెక్షన్లో మరింత్ర నియంత్రణ కల్పించడమే ఈ ఫీచర్ లక్ష్యం.
ఇప్పటి వరకూ యూ-ట్యూబ్’లో వీడియోల కింద చేసే కామెంట్లు కావాలంటే పబ్లిష్ చేసుకోవచ్చు.. లేదా పూర్తిగా డిజేబుల్ చేయవచ్చు. అలా కాకుండా కామెంట్లను మధ్యలో నిలువరించాలంటే పూర్తిగా తొలగించడం ఒక్కటే మార్గం. యూ-ట్యూబ్ తెచ్చిన ఈ ఫీచర్తో పాత కామెంట్లు కొనసాగిస్తూ కొత్త కామెంట్లు చేయకుండా నియంత్రించవచ్చునని యూ-ట్యూబ్ తన బ్లాగ్లో రాసుకుంది.