ఈ బ్యాంక్ ఎఫ్డీపై 9.5% వడ్డీరేటు
రిస్క్ లేకుండా నిలకడైన ఆదాయాన్ని కోరుకునేవాళ్ల తొలి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ)నన్న విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య బ్యాంకర్లు.. డిపాజిట్‌దారులను ఆకట్టుకోవడానికి ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీరేట్లనే ప్రకటిస్తున్నారు. ఈ వరుసలోకి యునిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) సైతం వచ్చింది.
- సీనియర్ సిటిజన్లకు సదవకాశం
రిస్క్ లేకుండా నిలకడైన ఆదాయాన్ని కోరుకునేవాళ్ల తొలి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ)నన్న విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య బ్యాంకర్లు.. డిపాజిట్‌దారులను ఆకట్టుకోవడానికి ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీరేట్లనే ప్రకటిస్తున్నారు. ఈ వరుసలోకి యునిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) సైతం వచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై ఇటీవలే బ్యాంక్ తమ వడ్డీరేట్లను సవరించింది. ఈ క్రమంలోనే ఆయా కాలపరిమితులపై గరిష్ఠంగా 9.5 శాతం వరకు వార్షిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది. ఈ నెల 9 నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. 701 రోజులు కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 9.45 శాతం వార్షిక వడ్డీరేటున్నది.
సాధారణ డిపాజిట్‌దారులకు ఇది 8.95 శాతమే. అలాగే 7 రోజులు నుంచి పదేండ్ల వరకు మెచ్యూరిటీ అయ్యే వివిధ మొత్తాల డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీరేట్లున్నాయి. ఇవి జనరల్ పబ్లిక్కు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకైతే కనిష్ఠంగా 4.50 శాతం, గరిష్ఠంగా 9.5 శాతం వడ్డీరేటు ఉన్నది. 1,001 రోజుల ఎఫ్డీపై సాధారణ డిపాజిటర్లు 9 శాతం, సీనియర్ సిటిన్లు 9.5 శాతం వడ్డీరేటు పొందవచ్చు. 181-201 రోజులు, 501 రోజులకుగాను సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం వడ్డీరేటున్నది. సాధారణ మదుపరులకు 8.75 శాతమే. కాగా, నిర్ణీత కాలపరిమితి ముగియకుండానే ముందస్తుగా ఉపసంహరించుకునే ఎఫ్డీలు, రికరింగ్ డిపాజిట్లపై ప్రీమెచ్యూర్ పెనాల్టీ ఒక శాతంగా ఉన్నది. ఇక సేవింగ్స్ ఖాతా వడ్డీరేట్లు లక్ష రూపాయల వరకు 6 శాతంగా, ఆపైన 7 శాతంగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

