Hyundai Grand i10 Nios Facelift | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..!
Hyundai Grand i10 Nios Facelift | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది. దీని ధర రూ.5.69 లక్షల నుంచి లభ్యం అవుతుంది.
Hyundai Grand i10 Nios Facelift | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ ఇండియా 2023 గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ తీసుకొచ్చింది. దీని ధర రూ.5.69 లక్షల నుంచి మొదలవుతుంది. సీఎన్జీ వేరియంట్‌తోపాటు 1.2 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌తో 2023 హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అందుబాటులో ఉంటుంది. రూ.11 వేలతో ఈ కార్ల బుకింగ్స్ మొదలయ్యాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన కర్బన ఉద్గారాలు అమల్లోకి రానుండటంతో 1.0-లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను హ్యుండాయ్ తప్పించింది.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ : నాలుగు ట్రిమ్స్ వేరియంట్లు: ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా
ఇవీ హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్స్
- నాలుగు ఎయిర్‌బ్యాగ్‌ల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌తో వస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ మోడల్.
- బ్లాక్ కలర్లో మాసివ్ ఫ్రంట్ గ్రిల్లేతో అప్‌ఫ్రంట్ న్యూ బంపర్ డిజైన్.
- న్యూ ట్రియో-యారో షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తున్నది.
- లైట్‌బార్‌తో ఎల్ఈడీ టెయిల్ లాంప్స్ కనెక్ట్ అవుతాయి.
- హ్యుండాయ్ 2023 గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ కారు ఇప్పటికే ఉన్న పొలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, టియల్ బ్లూ, ఫెర్రీ రెడ్ కలర్స్‌తోపాటు న్యూ స్పార్క్ గ్రీన్ కలర్‌తో వస్తున్నది.
- వైర్లెస్ చార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్- ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు 8- అంగుళాల టచ్ స్క్రీన్‌తో లభ్యం.
- క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, టైప్-సీ యూఎస్బీ చార్జింగ్ సాకెట్స్
- 1.2 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజిన్‌తో వస్తున్నది. దీంతో 83బీహెచ్పీ విద్యుత్, 114 ఎన్ఎం టార్చి లభ్యం.
- 5-స్పీడ్ స్టాండర్డ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తోపాటు 5-స్పీడ్ ఏఎంటీ యూనిట్ కూడా అదనపు ఆఫర్.
- మాన్యువల్ గేర్‌బాక్స్ గల మోడల్ లీటర్ పెట్రోల్‌పై 20.70 కి.మీ, ఆటోమేటిక్ వర్షన్ 20.10 కి.మీ. మైలేజీ.
- ఇక కొత్తగా అందుబాటులోకి వస్తున్న సీఎన్జీ కిట్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ మోడల్ కారు గరిష్టంగా 69 బీహెచ్పీ విద్యుత్, 95 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కిలో సీఎన్జీ గ్యాస్ 27.30 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు
- ఫోర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ స్టాండర్డ్
- టాప్ మోడల్స్‌లో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ యాంకరేజెస్, ఈఎస్ఈ, హిల్‌హోల్డ్ అసిస్ట్ వంటి బెల్స్, విజిల్స్‌తో కూడిన సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

