విపణిలోకి జాగ్వార్ న్యూ వేలార్.. ధరెంతంటే?!
విపణిలోకి జాగ్వార్ న్యూ వేలార్.. ధరెంతంటే?! | టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి వేలార్ అప్ డేట్ వర్షన్ కారును....

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి వేలార్ అప్ డేట్ వర్షన్ కారును దేశీయ విపణిలో ఆవిష్కరించింది. గత మోడల్ వేలార్ కారుతో పోలిస్తే 2021 మోడల్ కారులో పలు ఫీచర్లను అప్డేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.79.87 లక్షలుగా నిర్ణయించింది.
ఇప్పటివరకు పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభించిన వేలార్ కారు.. ఇక డీజిల్ వేరియంట్లోనూ ఖాతాదారులకు అందుబాటులో వచ్చింది. అయితే దీనికి రూ.84 వేలు అదనంగా ఖర్చు చేయాలి.
2.0 లీటర్, 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్ కల కొత్తకారు 204 హెచ్‌పీ శక్తిని, 430 ఎన్ఎం టార్చ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫోటైన్మెంట్లోనూ మార్పులు చేశారు.
ఇక పెట్రోల్ ఇంజిన్ 250 హెచ్‌పీ శక్తి, 430 ఎన్ఎం టార్చ్‌ను విడుదల చేస్తుంది. కొత్తగా ఎయిర్సస్పెన్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. గతంలోని రేర్ వ్యూ కెమెరా స్థానంలో 360 డిగ్రీ కెమెరాను తెచ్చారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతోపాటు క్యాబిన్ ఎయిర్ ఐయొనైజేషన్ సిస్టం ఏర్పాటు చేశారు.
తొలిసారి 2017 డిసెంబర్లో వేలార్ మోడల్ కారు విపణిలో అడుగు పెట్టింది. అప్పుడు వేలార్ ధర రూ.78.83 లక్షలుగా నిర్ణయించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jaugar
- Land Rover
- velar
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

