నాట్కో క్యాన్సర్ డ్రగ్కు అమెరికా అనుమతి

హైదరాబాద్, మే 22: క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే జెనెరిక్ లినాలిడోమైడ్ క్యాప్సుళ్లకు అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ యూఎస్ఎఫ్డీఐ అనుమతి లభించినట్లు నాట్కో ఫార్మా శనివారం తెలిపింది. పెద్దల్లో వచ్చే మల్టిపుల్ మైలోమా (ప్లాస్మా కణాల్లో ఏర్పడే క్యాన్సర్) చికిత్స కోసం వాడే ఈ 5ఎంజీ, 10 ఎంజీ, 25 ఎంజీ క్యాప్సుళ్లకు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతులు పొందామని, 2.5 ఎంజీ, 20 ఎంజీ క్యాప్సుళ్ళకు ప్రాధమిక అనుమతి లభించిందని హైదరాబాద్ ఫార్మా కంపెనీ నాట్కో వివరించింది.తమ మార్కెటింగ్ భాగస్వామ్య కంపెనీ యారో ఇంటర్నేషనల్ రెవ్లిమిడ్ బ్రాండ్నేమ్తో ఈ క్యాప్సుళ్లను అమెరికా మార్కెట్లో విక్రయిస్తుందని నాట్కో తెలిపింది.అలాగే కిడ్నీ, లివర్ మార్పిడి కేసుల్లో వాడే ఎవరోలిమస్ టాబ్లెట్లకు అమెరికా నియంత్రణా సంస్థ నుంచి తమ మార్కెటింగ్ భాగస్వామి బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్ తుది అనుమతి పొందిందని, ఈ టాబ్లెట్లను 0.25ఎంజీ, 0.5ఎంజీ, 0.75ఎంజీ స్ట్రెంత్ల్లో త్వరలో అమెరికా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు నాట్కో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

