గ్లాండ్ ఫార్మా కూడా..

25 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్లను తయారు చేయనున్న సంస్థ
హైదరాబాద్, మార్చి 16: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లాండ్ ఫార్మా కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను తయారు చేయడానికి సిద్ధమైంది. 25 కోట్ల స్పుత్నిక్ వీ కొవిడ్-19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఈ వ్యాక్సిన్‌ను నాలుగో త్రైమాసికం నుంచి సరఫరా చేయనున్నది. స్పుత్నిక్ వీ కొవిడ్-19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండటంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్లాండ్ ఫార్మా బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ వ్యాక్సిన్‌ను గమాలెయా నేషనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమిలోజీ అండ్ మైక్రోబయోలాజీ అభివృద్ధి చేసింది. ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్, హెటిరో సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి కూడా. ఈ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన టెక్నాలజీలో ఇప్పటికే విజయం సాధించడంతో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి అనుమతి పొందినట్లు గ్లాండ్ ఫార్మా తెలిపింది. దీంతో గ్లాండ్ ఫార్మా షేరు ధర భారీగా పుంజుకున్నది. ఇంట్రాడేలో 10% వరకు లాభపడ్డ కంపెనీ షేరు ధర చివరకు 6.95% లాభంతో రూ.2,718.65 వద్ద ముగిసింది
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

