Beauty tips | పొట్ట చర్మంపై చారలా.. ఈ చిట్కాలు మీ కోసమే..!
Beauty tips | స్ట్రెచ్ మార్క్స్..! మన చర్మం సాధారణ స్థాయికి మించి సాగడం వల్ల పొట్టపై ఈ చారలు ఏర్పడుతాయి. ఈ చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. మహిళలను ముఖ్యంగా అందం కోసం తపించే మహిళలను ఈ స్ట్రెచ్ మార్క్స్ తెగ ఇబ్బంది పెడుతాయి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి.
Beauty tips : స్ట్రెచ్ మార్క్స్..! మన చర్మం సాధారణ స్థాయికి మించి సాగడం వల్ల పొట్టపై ఈ చారలు ఏర్పడుతాయి. ఈ చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. మహిళలను ముఖ్యంగా అందం కోసం తపించే మహిళలను ఈ స్ట్రెచ్ మార్క్స్ తెగ ఇబ్బంది పెడుతాయి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వేగంగా లావు పెరిగిన పురుషుల్లోనూ చర్మంపై ఈ స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. కానీ పురుషుల స్ట్రెచ్ మార్క్స్ షర్ట్ లోపల కనిపించకుండా ఉంటాయి. ఇబ్బంది ఉండదు. కానీ ఆడవాళ్ల చీరకట్టు వల్ల మార్క్స్ బయటికి కనిపిస్తాయి. కాబట్టి ఇబ్బంది పడుతారు. మరి ఈ చారలు పోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…
గర్బధారణ సమయంలో కడుపులో బిడ్డ పెరిగినాకొద్ది పొట్ట సాగుతుంది. దాంతో పొట్ట మీది చర్మం సాగి చారలు ఏర్పడుతాయి. ప్రసవం తర్వాత పొట్టభాగం యథాస్థితికి వచ్చినా ఈ చారలు పోవు. కాకపోతే కొద్దిగా సన్నబడుతాయి. ఈ చారల సమస్య మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వాటిని పోగొట్టుకోవడానికి వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ప్రయోజనం లేక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి వంటింట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఎంతో మంది మహిళలు ఈ వంటింటి చిట్కాలు పాటించి సక్సెస్ అయ్యారట. వాటిలో బాగా సక్సెస్ రేటు ఉన్న రెండు వంటింటి చిట్కాలు చూద్దాం…
ఇవీ చిట్కాలు
మొదటి చిట్కా : స్నానం చేయడానికి గంట ముందు ఆముదం నూనెను గోరువెచ్చగా చేసుకుని చారలు ఉన్నచోట తైలమర్దన చేయాలి. ఆ తర్వాత గంట సేపటికి స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ పోతే నాలుగు వారాల్లో తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
రెండో చిట్కా : ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బాదాం నూనెతో చారలపై మర్దన చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేసి, చారలపై కలబంద గుజ్జు రాసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తూపోతే నాలుగైదు వారాల్లోనే మంచి ఫలితం ఉంటుందట.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

