బ్రా స్ట్రాప్స్‌తో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Bra straps: మహిళలు సాధారణంగా వక్ష సౌష్ఠవం కోసం బ్రాలను ఉపయోగిస్తుంటారు. అయితే, అందంగా కనిపించడం కోసం వాడే ఈ బ్రాలు కొందరిలో చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. బ్రా స్ట్రాప్స్ చర్మానికి బిగ్గరగా అతుక్కుని ఉండటంవల్ల వాటి కింద ఉన్న చర్మం

హైదరాబాద్: మహిళలు సాధారణంగా వక్ష సౌష్ఠవం కోసం బ్రాలను ఉపయోగిస్తుంటారు. అయితే, అందంగా కనిపించడం కోసం వాడే ఈ బ్రాలు కొందరిలో చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. బ్రా స్ట్రాప్స్ చర్మానికి బిగ్గరగా అతుక్కుని ఉండటంవల్ల వాటి కింద ఉన్న చర్మం రంగు మారుతుంది. స్ట్రాప్స్ పక్కన చర్మంతో పోల్చితే స్ట్రాప్స్ కింది చర్మం కొంత తెల్లగా ఉంటుంది. అయితే, చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దామా..?
పాలు, బాదం నూనె మిశ్రమం
బ్రా స్ట్రాప్స్ ఏర్పడిన చోట పాలు, బాదం నూనె మిశ్రమాన్ని రాసి మృదువుగా మర్దన చేయాలి. ఆ తర్వాత మిశ్రమం రాసిన ప్రదేశాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. కడగడానికి సబ్బు వాడకూడదు.
నిమ్మ రసం, చక్కెర మిశ్రమం
చెంచా చక్కెరలో అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మరకలున్నచోట రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూ చేయడంవల్ల క్రమంగా మరకలు తగ్గిపోతాయి.
సన్‌స్క్రీన్ లోషన్
సన్‌స్క్రీన్ లోషన్‌ను తరచూ చర్మానికి రాసుకోవడం ద్వారా సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. దాంతో ఒంటిపై బ్రా స్ట్రాప్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. పాత మరకలు మరింత పెరగకుండా చేసుకోవచ్చు.
పెరుగు, పసుపు మిశ్రమం
ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బ్రా మచ్చలున్నచోట రాయాలి. ఇలా తరచూ రాస్తుంటే మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుంది.
ఎస్సెన్షియల్ నూనెలు
లావెండర్ లాంటి ఎస్సెన్షియల్ నూనెలు బ్రా స్ట్రాప్స్‌ను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి. బ్రా మరకలపై ఎస్సెన్షియల్ నూనెలను మృదువుగా రుద్దాలి. దాంతో ఆ నూనెల నుంచి పోషకాలు అంది చర్మం కాంతులీనుతుంది.
వాటర్ థెరపీ
చర్మం ఆరోగ్యానికి నీళ్లు కూడా చాలా అవసరం. తగినన్ని నీళ్లు తాగడంవల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా తాజాగా కాంతులీనుతుంది. అదేవిధంగా చర్మంపై మరకలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

