CM Jagan | ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. సీఎం జగన్ రాజీనామా
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు.
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖ పంపించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వైసీపీ ఘోర పరాభవం పాలైంది. కనీసం జనసేన పార్టీ సాధించినన్ని సీట్లు కూడా చేజిక్కించుకోకపోయింది. ఎన్నికల ముందు ‘వై నాట్ 175’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు.
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ సహా పలువురు కీలక నేతలు ఇప్పటి వరకూ ఓటమి బాటలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేసేశారు.
కాగా, 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. ఆరు స్థానాలకుపైగా కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
Also Read..
Loksabha Elections 2024 | ఆధిక్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Prajwal Revanna | హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి
Loksabha Elections 2024 | ఆధిక్యంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

