Posani Krishnamurali | జయప్రద జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారు.. పోసాని కృష్ణమురళి ఫైర్
Posani Krishnamurali | వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
Posani Krishnamurali | వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
వాలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు అని పోసాని కృష్ణమురళి అన్నారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇండ్ల తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేశ్‌లా తాగుబోతులు, తిరుగుబోతులు కాదని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఒక మనవడిలా, అన్నలా, బిడ్డలా తోడుంటారు తప్ప.. నీ కొడుకులా ఓ పక్క పళ్లెం.. మరో పక్క గొళ్లెం మెయింటైన్ చేయరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జయప్రద లాంటి పెద్ద హీరోయిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఎన్టీఆర్ ఇల్లాలిని బజారుకు ఈడ్చాడని అన్నారు. ఇదంతా చంద్రబాబు అండ్ కో హయాంలోనే జరిగిందని అన్నారు. వీళ్లందరికీ ఆడవాళ్లంటే చాలా చీఫ్ అని విమర్శించారు. ఇందుకు బాలకృష్ణ మాటలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆడది కనిపిస్తే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలని బాలకృష్ణ గతంలో అన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు కొడుకు తాగుబోతు, తిరుగుబోతు అని మండిపడ్డారు. అలాంటి వారిని వైసీపీలో చూపించగలరా? అని ప్రశ్నించారు. ఈ దొంగ వెధవలను అస్సలు నమ్మవద్దని అన్నారు. వాళ్ల ఏడుపంతా జగన్‌ను దించేయాలని మాత్రమే అని అన్నారు. తాను కమ్మ కులస్తుడు కాబట్టి చంద్రబాబును తిట్టవద్దని కొందరు చెబుతున్నారని.. అవినీతిపరుడు, దొంగ కమ్మవాడైతే మద్దతివ్వాలా? అని ప్రశ్నించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పైనా పోసాని నిప్పులు చెరిగారు. అసలు అది ఒక పార్టీయేనా? అని ఎద్దేవా చేశారు. ఒక కూటమి అనుకునేలోపే వాళ్లకు ఇచ్చిన సీట్లలో పవన్ కళ్యాణ్ తన వాళ్లను నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. గేదెలు కాచుకునేవాడు కూడా పవన్ కళ్యాణ్ మాటలు నమ్మరని విమర్శించారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని అంటావు.. ఏపీలో దేవతల్లాంటి వాలంటీర్ల ఆడపడుచుల్ని ఇలా మాట్లాడటం తగునా? అని ప్రశ్నించారు. ఇంత ఉన్మాదిగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడంటే ఇక దేవుడే కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపైనా పోసాని కృష్ణమురళి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఒక టైప్ అనుకుంటే.. దగ్గుబాటి పురంధేశ్వరి వంద టైపులు అని విమర్శించారు. ఆమెకు ఆరెస్సెస్ అంటే కూడా ఏంటో తెలియదని అన్నారు. సావర్కర్ అంటే గవాస్కర్ అనుకుంటుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మీద సీజేఐకి లేఖ రాసిన పురంధేశ్వరి.. మోసాలు చేసిన సుజనా చౌదరి, సీఎం రమేశ్‌పై ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వివిధ కేసుల్లో స్టేలపై బతుకుతున్న చంద్రబాబును జైల్లో పెట్టాలని ఎందుకు లేఖలు రాయడం లేదని మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

