Perni Nani | కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా.. బందరు అసిస్టెంట్ కమిషనర్కు పేర్ని నాని వార్నింగ్
Perni Nani | ఏపీలోని మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చివేయడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నిప్పులు చెరిగారు. మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులగా పనిచేస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే ప్రజల ఇళ్లను కూల్చడంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు మీద ఆగ్రహం వ్యక్తంచేశారు
Perni Nani | ఏపీలోని మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చివేయడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నిప్పులు చెరిగారు. మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులగా పనిచేస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే ప్రజల ఇళ్లను కూల్చడంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు మీద ఆగ్రహం వ్యక్తంచేశారు. 2029లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తానని బెదిరించారు.
కొల్లు రవీంద్రకు తొత్తులగా పనిచేసే ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టేది లేదని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర గుర్తుపెట్టుకో.. నువ్వు చెప్పావని ఇల్లు కూల్చేందుకు కాపలాగా వచ్చిన సీఐ, ఎస్సైలను మళ్లీ బందరు తీసుకొస్తా.. వాళ్లనే కాపలాగా పెట్టి.. నీకు ఇలాగే చూపిస్తానని హెచ్చరించారు. ఇప్పుడు ఇళ్లను కూల్చేందుకు వచ్చిన అధికారులను ఎవరినీ వదలమని.. వాళ్ల సంతి చూస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వారిని బందరు తీసుకొచ్చి మరీ కొల్లు రవీంద్ర ఇంటిని కూల్చేస్తామని అన్నారు. జేసీబీలు, గునపాలు తిగితే ఎలా ఉంటుందో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చైదరికి తెలిసేలా చేస్తానని తేల్చిచెప్పారు.
బందరు నుంచి వెళ్లిపోయి.. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అసిస్టెంట్ కమిషనర్ గోపాల్రావు ఇంటి సంగతి చూస్తానని అన్నారు. తెలంగాణకు పోయినా.. కేసీఆర్ కాళ్లు పట్టుకుని.. నిన్ను తీసుకొచ్చి మరీ నీ ఇంటి సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏసీపీ ఇంటికి కూడా ప్లాన్ లేదని ఆయన ఇంటి సంగతి కూడా చూస్తానని హెచ్చరించారు.
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా
అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుకు పేర్నినాని వార్నింగ్
నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను.. బందరు కాదు, ఏపీలో ఎక్కడ ఉన్నాసరే
నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా
మచిలీపట్నంలో… pic.twitter.com/cDYEa4wCnT
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Bandar
- KCR
- Kollu Raveendra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

