వైసీపీ భారీ మెజారిటీతో గెలువడం ఖాయం : ఏపీ హోంమంత్రి
వైసీపీ గెలుపు ఖాయం | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

అన్నవరం : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూర్లో మీడియాతో ఆమె మాట్లాడారు.
నిన్న తిరుపతిలో జరిగిన చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరిగిందనడం అవాస్తమని అన్నారు.
సానుభూతి కూడగట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించాలనే రాళ్ల దాడి జరిగినట్లు టీడీపీ నాయకులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
రాళ్ల దాడి చేసి అలజడి సృష్టించాల్సిన అవసరం వైసీపీ లేదని అన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం తిరుపతిలోని రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్ షో నిర్వహించారు.
అక్కడ బహిరంగ సభలో తమపై కొందరు రాళ్ల దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయన ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

