అన్న క్యాంటీన్లను నిర్వహించి తీరుతాం : లోకేశ్
Nara Lokesh| పేదల ఆకలిని తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని నిర్వహించి తీరుతామని
అమరావతి : పేదల ఆకలిని తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని నిర్వహించి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఇవాళ తెనాలి పట్టణంలోని మార్కెట్ సర్కిల్లో అన్న క్యాంటీన్లను అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని అన్నారు.
నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని, ఇప్పుడు తెనాలిలోనూ అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతుండటంపై అసహనం వ్యక్తంచేశారు. రోజు మాదిరిగానే ఆహారం తీసుకువస్తున్న టీడీపీ వారి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వేరే చోటికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వాహనంలో నుంచి కొంత ఆహారాన్ని తీసుకుని మున్సిపల్ మార్కెట్ వద్దకు చేరుకు ఆహార పంపిణీని చేపట్టారు. అక్కడకూ చేరుకున్న మున్సిపల్ అధికారులు ఆహార పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
అదేసమయంలో వైసీపీ శ్రేణులు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు. ఐతే తమకు ఆంక్షలు విధించి వైసీపీ శ్రేణులను ఎలా అనుమతిస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alwal TIMS Hospital, | నత్తనడకన అల్వాల్ టిమ్స్ పనులు.. ఆర్అండ్బీ శాఖలో అంతులేని అలసత్వం
Fake Court Orders | ఫేక్ కోర్టు ఆర్డర్లతో బెట్టింగ్ వెబ్సైట్ల మూత.. రెండు ఫోర్జరీ ఆర్డర్లతో 129 వెబ్సైట్లకు షాక్
Farmer DISCOM | రైతు డిస్కమ్‌కు రెడ్‌సిగ్నల్..! ఇంకా ప్రారంభంకాని కార్యకలాపాలు
Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. లీటరుపై రూ.2-4 వరకు పెంచిన సంస్థలు
KTR | ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు.. కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

