AP Home Minister | పేలుడులో గాయపడ్డ కానిస్టేబుళ్లకు అండగా ఉంటాం : ఏపీ హోం మంత్రి
AP Home Minister | కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.
అమరావతి : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత ( Minister Anitha) పరామర్శించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పారు . పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత మంగళవారం చల్లపల్లి పోలీసులు దీపావళి సమయంలో సీజ్ చేసిన టపాసులను సీజ్ చేశారు. వీటిని పంచనామాకు సిద్ధం చఏస్తుండగా కిందపడి పేలిపోయాయి.
ఈ పేలుడులో ఎస్సై దుర్గావీరాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగుర్ని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఈపేలుడు దెబ్బకు పోలీస్ స్టేషన్లోని ఫర్నీచర్, బయట నిలిపి ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

