Vizag Drug Case | సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని వాపోయింది. సంధ్యా ఆక్వా సహా అనుబంధ కంపెనీల లైసెన్స్లు రద్దు చేయాలని ఎంపెడాకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. వీసీటీపీఎల్ను విశాఖ పోర్టు ట్రస్ట్ స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కస్టమ్స్ వైఫల్యంతోనే పత్తు పదార్థాల రవాణా జరుగుతుందని ఆరోపించింది.