శ్రీశైలంలో వైభవంగా ప్రభోత్సవం
వైభవంగా ప్రభోత్సవం | శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రభోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అంబరానంటుతున్నాయి. మూడోరోజు సోమవారం ఉదయం ఆలయంలో అర్చకులు స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు
జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు నిర్వహించారు.
అనంతరం శ్రీభ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు జరిపించారు.
సాయంత్రం ఉత్సవమూర్తుల ప్రభోత్సవం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో ప్రభను శోభాయమానంగా అలంకరించారు.
ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ తీసుకువచ్చి ప్రభపై అధిష్టింపజేసిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
ప్రభను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. చైత్ర శుద్ధ పాడ్యమిరోజు స్వామిఅమ్మవార్లు రథోత్సవంలో క్షేత్ర పురువీధుల్లో విహరించేందుకు ముందు చండీశ్వరుడు ముందుగా క్షేత్ర పర్యటన చేసి వచ్చేందుకు ప్రభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

నందివాహనంపై విహరించిన నీలకంఠుడు
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు.
నందివాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో పనుల్లో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని ఇతిహాసాల్లో చెప్పబడింది.
మహాసరస్వతిగా శ్రీశైల భ్రమరి..
శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే విద్యాప్రాప్తితోపాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకులు ఉమేశ్ పట్వారీ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

