తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ (TTD) మరికాసేపట్లో విడుదల చేయనున్నది. అక్టోబరు నెలకు సం బంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల (Arjitha seva tickets) ఆన్లైన్ లక్కీడిప్ కోసం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి భక్తులు తమ వివరాలను నమోదుచేసుకోవచ్చు. ఈ అవకాశం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. లక్కీడిప్‌లో ఎంపికైనవారు సొమ్ము చెల్లించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జూలై 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అకోబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల 24న ఉదయం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. టికెట్లను భక్తులు https://tirupatibalaji.ap.gov.inలో బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.