Janasena | జనసేనకు టాలీవుడ్ పెద్దలు సీక్రెట్‌గా సపోర్ట్ చేస్తున్నారా..?
Janasena | గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు.. సీన్ రివర్స్ అవుతుంది. పైకి కనిపించడం లేదు కానీ టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు.
Janasena | సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లడం.. అక్కడ చెప్పడం తిప్పడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఆ మ్యాజిక్ పెద్దగా జరగలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కువగా పొలిటికల్ క్షేత్రంలో నటిస్తున్నారు అంటూ విశాల్ లాంటి హీరోలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రజలు ఆటోమేటిక్ గా వాళ్ల నటనకు పడిపోతున్నారు అంటూ చెప్పాడు ఆయన. వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కాబట్టే సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు అన్నాడు విశాల్.
ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఆయన జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతుంది. తెలుగుదేశం, బిజెపితో కలిపి ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు. గత ఎన్నికల్లో ఊహించని పరాభవం పవన్ కళ్యాణ్ ను, ఆయన పార్టీ శ్రేణులను భారీగానే దెబ్బతీసింది. అయితే ఈ ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి కచ్చితంగా ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభావం భారీగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు.. సీన్ రివర్స్ అవుతుంది. పైకి కనిపించడం లేదు కానీ టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు. కాకపోతే బయటకి అది చెప్తే ఎక్కడ లేనిపోని తలనొప్పులు వస్తాయో అని అందరూ గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టున్నారు. ఇక మెగా హీరోలైతే పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అడగాలే కానీ ఎప్పుడైనా ప్రచారం చేయడానికి రెడీ అంటున్నారు.
చిరంజీవి అయితే తమ్ముడి కోసం మీడియా ముందు అప్పుడప్పుడు పొలిటికల్ హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నాడు. మీ భవిష్యత్తు మార్చే నాయకుడిని తెలివిగా ఎంచుకోవాలి అంటూ ఆ మధ్య చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక విశ్వంభర సెట్లో జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం నుంచి సంచలనం సృష్టించాడు చిరంజీవి. రామ్ చరణ్ కూడా బాబాయి వెనక నడుస్తున్నాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ సైతం పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మరికొందరు సీనియర్ హీరోలు కూడా ఈసారి పవన్ గెలవాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశంకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎలాగో బాలకృష్ణ అభిమానులు కూడా పవన్ వెంట నడుస్తున్నారు. మొత్తానికి ఈసారి టాలీవుడ్ లో పెద్ద తలకాయలు చాలా వరకు జనసేనాని వెంట ఉన్నాయి. మరి ఈ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కు ఎంతవరకు పనికొస్తుందో చూడాలి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

